Telugu News

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి కరోనా

ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న మంత్రి క్షేమంగా ఉన్నారన చెబుతున్న వైద్యులు..

0

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి కరోనా

ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న మంత్రి
క్షేమంగా ఉన్నారన చెబుతున్న వైద్యులు..
గత మూడు, నాలుగు రోజులుగా తనను కలిసిన వాళ్ళు పరీక్ష చేయించుకోవాలని విజ్ఞప్తి

తన ఐసోలేషన్ పూర్తయ్యే వరకు ప్రజలు తన వద్దకు రావద్దు
(వరంగల్-విజయం న్యూస్)

రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి కరోనా వచ్చింది. కొంచెం నలతగా ఉండటంతో శనివారం సాయంత్రం పరీక్ష చేయించుకోగా యాంటీజెన్ రాపిడ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది. దీంతో మంత్రి వెంటనే ఐసోలేషన్ లోకి వెళ్ళారు. వైద్యులను సంప్రదించి, తగు మందులు తీసుకుంటూ, జాగ్రత్త వహిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, రాష్ట్ర రైతుల ప్రయోజనార్థమై, వారు పండించిన ధాన్యం, బియ్యం కేంద్రం కొనుగోలు చేయడం పై రాత పూర్వక హామీ కోసం గత నాలుగు, ఐదు రోజులుగా ఢిల్లీలో పడిగాపులు కాసిన నేపథ్యంలో తనకు కరోనా వచ్చిందని మంత్రి అన్నారు. ఇప్పటికైనా కేంద్రం రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు.

అయితే, గత మూడు, నాలుగు రోజులుగా తనను కలిసిన వాళ్ళు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, తగు జాగ్రత్తలు వహిస్తూ, వీలైనంత వరకు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని కోరారు.

నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో అధికారులు, పి ఏ లు

కాగా, తన ఐసోలేషన్ పూర్తయ్యే వరకు ప్రజలు ఎవరూ తనను కలవడానికి తన వద్దకు రావద్దని మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు. తను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు ఇటు హైదరాబాద్ లో, అటు హన్మకొండ, పాలకుర్తి, ఇతర మండల కేంద్రాల్లో అధికారులు, పీ ఏ లు అందుబాటులో ఉంటారని, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారని, ప్రజలు సహకరించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు విజ్ఞప్తి చేశారు.

 

also read :- నేడు మాజీ మంత్రి తుమ్మల పర్యటన

also read:- సెయింట్ జోసఫ్స్ కో- కెథడ్రల్ చర్చి గుట్టలబజార్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు .