Telugu News

దేశంలో సుస్థిర ప్రాథ‌మిక ఆరోగ్యానికి చ‌ర్య‌లేవి?

= కేంద్రాన్నిటీఆర్ఎస్ లోక్‌స‌భ ప‌క్ష నేత నామ నాగేశ్వ‌ర్‌రావు నిల‌దీత‌

0

దేశంలో సుస్థిర ప్రాథ‌మిక ఆరోగ్యానికి చ‌ర్య‌లేవి?
కేంద్రాన్నిటీఆర్ఎస్ లోక్‌స‌భ ప‌క్ష నేత నామ నాగేశ్వ‌ర్‌రావు నిల‌దీత‌
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
క‌రోనా మ‌హ‌మ్మారి యావ‌త్ దేశాన్ని అతలాకుత‌లం చేస్తున్న కీల‌క త‌రుణంలో సుస్థిర‌ ప్రాథ‌మిక ఆరోగ్యానికి(ప్రైమ‌రి హెల్త్‌) కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్యలేమిట‌ని టీఆర్ఎస్ లోక్‌స‌భ ప‌క్ష నేత నామ నాగేశ్వ‌ర్‌రావు ప్ర‌శ్నించారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్, ఆరోగ్య సంబంధిత సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి దేశ స్థూల జాతీయోత్ప‌త్తి(జీడీపీ)లో కనీసం ఒక శాతాన్ని ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ(పీహెచ్సీ)కి కేటాయించాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌(డ‌బ్ల్యూహెచ్ఓ) ప్రభుత్వానికి సూచించిన విష‌యాన్ని ఆయన లోక్‌స‌భ‌లో ప్ర‌స్తావించారు. ఎంపీ నామ ప్ర‌శ్న‌కు డా. భారతి ప్రవీణ్ పవార్ లిఖిత‌పూర్వ‌కంగా సమాధానిమిస్తూ 2017-18 జాతీయ ఆరోగ్య ఖాతాల(ఎన్ హెచ్ఏ) అంచనాల ప్రకారం, ఆరోగ్యానికి కేటాయించిన ప్రభుత్వ వ్యయం జీడీపీలో ఒక శాతంకు ఎక్కువ ఉన్న‌ద‌ని చెప్పారు.

also read :-ఖాళీ జాగా…వేసేయ్ పాగా…!

కేంద్ర ప్ర‌భుత్వం నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ఎం) కింద, పబ్లిక్ హెల్త్‌కేర్ డెలివరీని బలోపేతం చేయడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సాంకేతిక, ఆర్థిక సహాయం అందింస్తున్నామమ‌ని పేర్కొన్నారు. ఎన్ హెచ్ఎం ద్వారా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నిబంధనల ప్రకారం కొత్త సౌకర్యాల ఏర్పాటుకు చ‌ర్‌ీలు తీసుకున్నామ‌న్నారు. ఇప్పటికే ఉన్నవాటిని అప్-గ్రేడేషన్ చేయడం తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వారి అవసరాల ఆధారంగా మౌలిక సదుపాయాల అంతరాలను తగ్గించడానికి సౌకర్యాలు అందిస్తున్న‌ట్టు వివ‌రించారు. యూనివర్సల్ హెల్త్ కవరేజీని క్రమంగా సాధించడానికి, సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి 2018లో ఆయుష్మాన్ భారత్, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ప్రారంభించిన‌ట్టు గుర్తు చేశారు. డిసెంబర్ 2022 నాటికి 1,50,000 హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్‌ల ఏర్పాటు లక్ష్యమన్నారు.

also read :-కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై

ప్రస్తుతం ఉన్న ఉప-ఆరోగ్య కేంద్రాలు (ఎస్ హెచ్సీ), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లు (యూపీహెచ్సీ) సమగ్ర ప్రాథమిక విద్యను అందించడానికి ఏబీ-హెచ్ డ‌బ్ల్యూసీఎస్)గా రూపాంతరం చెందాయియ‌ని తెలిపారు. ఇండియా కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్‌నెస్ ప్యాకేజీ-l రూ.15,000 కోట్లతో 22 ఏప్రిల్ 2020న క్యాబినెట్ ఆమోదించింద‌ని గుర్తు చేశారు. కోవిడ్-19 ముందస్తు నివారణ, గుర్తింపు నిర్వహణ కోసం తక్షణ ప్రతిస్పందన కోసం క్యాబినెట్ రూ.23,123 కోట్ల మొత్తానికి 08 జూలై 2021న “ఇండియా కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్స్ ప్రిపేర్డ్‌నెస్ ప్యాకేజీ-2 పథకాన్ని కూడా ఆమోదించిందన్నారు. ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించి, ఆరోగ్య వ్యవస్థను మ‌రింత సుస్థిరంగా తీర్చిదిద్ద‌ట‌మే ఈ పథకం లక్ష్యమన్నారు.