Telugu News

ఖమ్మం జిల్లాలో గంజాయి పై నిఘా

0

గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు పటిష్టమైన వ్యూహాం

👉 *నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు క్షేత్రస్ధాయిలో సమాచార, నిఘా వ్యవస్థ పటిష్టం..*

ఇసుక అక్రమ రవాణా పై ఎస్ఐ జితేందర్ మెరుపుదాడి

👉 *సరిహద్దు రాష్ట్రాల నుండి వచ్చే వాహనాలపై దృష్టి సారించి.. ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి.*
👉 *గంజాయి క్రయవిక్రయాలపై ఫోకస్.. స్ధానిక పోలీస్ సిబ్బందిని అప్రమత్తంగా వుండాలి*

👉 *గంజాయిని పసిగట్టే నార్కోటిక్ డ్రగ్స్ పోలీసు జాగిలాను ఉపయోగించాలి*

👉 *నిందుతులపై పీడీ యాక్ట్, శిక్ష పడేలా వేగవంతంగా కేసుల విచారణ…*

(ఖమ్మం క్రైం-విజయం న్యూస్)

గంజాయి నేరస్థులు చెక్ పెట్టేందుకు క్షేత్రస్ధాయిలో సమాచార, నిఘా వ్యవస్థను పటిష్ట పరిచి అవసరమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలని పోలీసు కమిషనర్ విష్ణు యస్. వారియర్ పోలీసు అధికారులకు ఆదేశించారు.శుక్రవారం పోలీసు కమిషనర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పోలీసు అధికారులతో మాట్లాడారు. జిల్లాలో ఆసాంఘిక కార్యకాలాపాలకు పాల్పడే నిందుతులపై కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. గంజాయి వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడే క్రిమినల్స్ పై కేసులు నమోదు చేసి నిందుతులకు శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

Also read:- ఇసుక అక్రమ రవాణా పై ఎస్ఐ జితేందర్ మెరుపుదాడి

గంజాయి అక్రమ రవాణా నియంత్రణ క్రమంలో ఎంతటివారైనా ఉపేక్షించొద్దన్నారు. జిల్లా సరిహద్దుల నుండి వచ్చే అక్రమ రవాణా నియంత్రించేందుకు మూలాలను, కీలక వ్యక్తులను గుర్తించాలని సూచించారు…
నేరాలు జరగకుండా వుండేందుకే అవసరమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు.నేరాలకు పాల్పడుతున్న నిందుతుల జాబితాను సిద్ధం చేసి పి.డి యాక్ట్ అమలు చేయాలని సూచించారు.గంజాయి, మాదకద్రవ్యాల వంటి అక్రమ రవాణాను పసిగట్టే నార్కోటిక్ డ్రగ్స్ పోలీసు జాగిలాను ఉపయోగించాలని సూచించారు.సరిహద్దు రాష్ట్రాల నుండి వచ్చే వాహనాలపై దృష్టి సారించి.. ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి.