Telugu News

యుద్దబేరి మొదలైంది..విజయం మనకే వస్తుంది: పువ్వాడ

కాంగ్రెస్ తెలంగాణ చరిత్రను మరుగున పడేసే కుట్ర చేస్తోంది.

0

యుద్దబేరి మొదలైంది..విజయం మనకే వస్తుంది: పువ్వాడ

== కాంగ్రెస్ తెలంగాణ చరిత్రను మరుగున పడేసే కుట్ర చేస్తోంది.

== రాష్ట్ర ప్రజల హక్కుల కోసం ఎంత దూరమైనా వెళ్తాం

== ఖమ్మంలో గులాబీ జెండా ఎగరడం ఖాయం

== విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ

== ప్రజల కోసం పని చేస్తున్నా..ఆశీర్వదించండి: నామా

== ఈనెల 29న ఖమ్మం లో కేసీఆర్ బస్సుయాత్ర: గాయత్రి రవి

(ఖమ్మం ప్రతినిధి -విజయం న్యూస్)

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మం బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 23 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కార్యకర్తలందరికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ చరిత్రను తెలంగాణ జాతిపిత కేసీఆర్  చేసిన పనులను మరుగున పడేలా చేద్దాం అనుకునే మరుగుజ్జులకు అది జరగని పని అని ఆరోపించారు.రాష్ట్ర ప్రజల హక్కుల కోసం ఎంత దూరమైనా వెళ్తా.. చావు నోట్ల తలైన పెడతా అని సవాల్ చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి కేసిఆర్ అని గుర్తు చేశారు.నాటి యూపీఏ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ సాధించిన వ్యక్తి కేసిఆర్ అని, రాష్ట్రాన్ని సాధించిన మహనీయుడు కేసిఆర్ అని, అలాంటి మహానీయుడికి ఎన్నికల్లో ఖమ్మం సీటును కానుక గా ఇవ్వాలని కోరారు.ఈ నెల 29న జరిగే కేసిఆర్ బస్సు యాత్రను పెద్ద ఎత్తున ప్రజలు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

ఖమ్మం నగరంలోని మయూరి సెంటర్ నుండి జెడ్పీ సెంటర్ వరకు ఈ బస్సు యాత్ర జరుగుతుందని, నామా నాగేశ్వరరావు స్థానిక వ్యక్తి, ఆయనకు మన సమస్యలు తెలుసు. మన ప్రాంతానికి చెందిన వ్యక్తిని మనం గెలిపించుకోవాలని కోరారు.

పార్లమెంట్ లో మన జిల్లా గురించి, సమస్యల గురించి మాట్లాడిన వ్యక్తి నామా నాగేశ్వరరావు అని గుర్తు చేశారు.

అటువంటి వ్యక్తికి మరొకసారి అవకాశం కల్పించాలి. మన గొంతుక ను వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి:- ఖమ్మంలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా బిడ్డగా, మీ బిడ్డలా భావించి నాకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. 10 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యునిగా నేను మన జిల్లా ప్రయోజనాల గురించి ఆలోచించి పని చేశానని అన్నారు. మన రాష్ట్రానికి రావల్సిన నిధుల గురించి, మన రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్ట్ ల గురించి నేను కొట్లాడి తీసుకుని వచ్చానని గుర్తు చేశారు.నేను పార్లమెంట్ సభ్యునిగా లేని సమయంలో ఖమ్మం జిల్లాకు ఏ ఒక్క నేషనల్ హైవే కూడా లేదన్నారు. నేను పార్లమెంట్ సభ్యునిగా కేంద్రంతో కొట్లాడి ఖమ్మం జిల్లాకు నేషనల్ హైవే తీసుకునివచ్చానని చెప్పారు.

ఖమ్మం జిల్లాకు కేంద్ర ప్రభుత్వం ఒక్క నవోదయ స్కూల్ కూడ లేదు, ప్రతి జిల్లాకు ఒక నవోదయ స్కూల్ ఉండాలని, మెడికల్ కళాశాల కూడ ఖమ్మం లో లేదు మేము పార్లమెంట్ లో పోరాడటం కారణంగానే అవి మన జిల్లాకు వచ్చాయన్నారు.

ఇది కూడా చదవండి:- ఈ ఎన్నికల్లో చరిత్ర తిరగరాయాలి: ఎంపీ నామా

నేను పాల్వంచలో చదువుకున్నా. ఇక్కడి ప్రజలకు నా మీద నాటి నుండే అభిమానం ఉందన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలు వరదల్లో ఇబ్బందులు పడుతున్నారు అంటే నేను వదిలి పెట్టలేదు, మా నాన్న ట్రస్ట్ ద్వారా సేవ చేశామని గుర్తు చేశారు. జిల్లా ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడుతుంటే నీళ్ల ట్యాంక్ లు ఏర్పాటు చేశామని, నా జీవితం ఇప్పటివరకు, ఇక మీదట ఖమ్మం జిల్లా ప్రజల కోసం, ప్రజలతోనే సాగుతుందన్నారు. 10 ఏళ్లలో కెసిఆర్ మా నాయకుడు నమ్మశక్యం కానీ అభివృద్ధి రాష్ర్టంలో చేశారని తెలిపారు. మా నాయకుడు మాకు దిశా నిర్దేశం చేశారని, ప్రతి పక్షంలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. 17వ లోక్ సభలో రాష్ట్రం నుండి నలుగురు బీజేపీ వాళ్ళు, ముగ్గురు కాంగ్రెస్ వాళ్ళు ఉండి కూడ ఏ రోజు జిల్లా గురించి, రాష్ట్రం గురించి మాట్లాడలేదన్నారు. నా గురించి నేను చెప్పడం కాదు, నా గురించి పెద్దలు చెప్పారు జిల్లా ప్రజలకు తెలుసని చెప్పారు.ఇంకా ఒకసారి ఖమ్మం జిల్లా ఓటర్ మహాశయులు నాకు అవకాశం ఇవ్వాలని కోరారు. మీరు నన్ను ఆశీర్వదించి, మంచి మెజార్టీ ఇస్తారని నాకు నమ్మకం ఉందని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి:-:ప్రజలతోనే నా జీవితం: నామా

రాజ్యసభ సభ్యులు, ఎంపీ గాయత్రి రవి మాట్లాడుతూ

యుద్ధ బేరి మొదలైంది ఎన్నికలకు కేవలం 15 రోజులు మాత్రమే మిగిలి ఉందన్నారు.ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ 23 సంవత్సరాలు నిండాయి. కేసిఆర్ మహ నాయకుడు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండ ఉన్న హామీల గురించి ఆయన గళం విప్పారన్నారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ నిల్లు ఇవ్వకుండా పంటలను నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టాలి.కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ, మైనార్టీ, లంబాడి ఇలా ఏ ఒక్క మంత్రి లేకపోవడం దురదృష్టకరం.కనీసం మాదిగలకు ఒక్క సీటు కేటాయించకపోవడంతో ఘోరం.తాండ్ర వినోద్ రావు అనే వ్యక్తి ఎటువంటి సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొనని వ్యక్తి.అటువంటి బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావుకు ఓటు వేయడం కారణంగా ఖమ్మం జిల్లాకు ఎటువంటి ఉపయోగం లేదు.బీసీ ముద్దు బిడ్డ అని భావించి కేసిఆర్ రాజ్యసభ సభ్యునిగా నన్ను ఎన్నుకున్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించండి.