Telugu News

ట్రాఫిక్ సిబ్బందికి చలువ కళ్ల అద్దాలు అందజేసిన సీపీ

జాగ్రత్తగా ఉండాలని సూచించిన సీపీ

0
ట్రాఫిక్ సిబ్బందికి చలువ కళ్ల అద్దాలు అందజేసిన సీపీ
== జాగ్రత్తగా ఉండాలని సూచించిన సీపీ
(ఖమ్మం -విజయం న్యూస్)
ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి చలువ కళ్ల అద్దాలు (కూలింగ్​ గ్లాసెస్) ను  పోలీస్ కమిషనర్ సునీల్ దత్  అందజేశారు. రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రత దృష్టిలో పెట్టుకొని
హైదరాబాదు కు చెందిన వైపీఎస్ హాస్పిటల్ డాక్టర్ యాకుబ్ పాషా షేక్ వితరణ గా అందజేసిన చలువ అద్దాలను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చేతుల మీదుగా అందజేశారు.
మండుతున్న ఎండలో డ్యూటీ చేస్తున్న ట్రాఫిక్ సిబ్బంది ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా కూలింగ్​ గ్లాసెస్​ ఉపయోగించుకోవాలని పోలీస్ కమిషనర్ సూచించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు, ట్రాఫిక్ సీఐ మోహన్ బాబు, ఎస్సైలు రవి, సాగర్ పాటు ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.