Telugu News

సిపిఐ-కాంగ్రెస్ పొత్తు కుదిరింది: కూనంనేని

బీజేపీ ఓటమే లక్ష్యంగా పనిచేయాలి

0

సిపిఐ-కాంగ్రెస్ పొత్తు కుదిరింది: కూనంనేని

== బీజేపీ ఓటమే లక్ష్యంగా పనిచేయాలి

(కొత్తగూడెం -విజయం న్యూస్)

బిజెపి బీఆర్ఎస్ ను రాష్టం నుండి దేశం నుండి తరిమి కొట్టేందుకు ఇండియా కూటమిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో నీ పార్లమెంటు ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయి మద్దతు తెలియజేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో దేశంలో రాజకీయాలను ప్రభావితం చేసే సత్తా కమ్యూనిస్టు పార్టీలకు ఉందని వారితో ప్రయాణం మాకు ఎంతో సంతోషకరంగా ఉందని ప్రజల్ని చైతన్యవంతం చేసే దాంట్లో కమ్యూనిస్టులా ప్రాధాన్యత అత్యంత కీలకమని వారు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:- ఖమ్మం రేసులో RRR..?

ఈ యొక్క సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, సిపిఐ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా, సిపిఐ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా వెంకటరెడ్డి, తక్కెళ్ళపల్లి శ్రీనివాస్, పశ్య పద్మ, ఈటి నరసింహారావు, బాల మల్లేష్, కలివేణి శంకర్, తదితరులున్నారు.