Telugu News

ఖమ్మంలో సి.పి.ఐ ఎర్ర కవాత్

పెవిలియన్ గ్రౌండ్ నుంచి ఇందిరానగర్ పర్ణశాల వరకు ప్రదర్శన

0

ఖమ్మంలో సి.పి.ఐ ఎర్రకవాత్
== పెవిలియన్ గ్రౌండ్ నుంచి ఇందిరానగర్ పర్ణశాల వరకు ప్రదర్శన
(ఖమ్మం-విజయంన్యూస్)
భారత కమ్యూనిస్టు పార్టీ 97వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఖమ్మం నగరంలో ఎర్రకవాత్ నిర్వహించారు. 97వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని 97 ఎర్రజెండాలతో రెడ్ షర్ట్ వాలంటీర్లు కవాత్ ప్రారంభించారు. కవాత కుముందు డప్పు, కోలాట దళాలు నడిచాయి. పెవిలియన్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ప్రదర్శన మయూరి సెంటర్, పాతబస్టాండ్, జెడ్పీ సెంటర్, ఐ.టి.హబ్ సెంట్ మీదుగా ఇందిరానగర్ లోని సి.పి.ఐ పైలాన్ వద్దకు చేరుకుంది. దారి పొడవున రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాత్ చూపరులను ఆకట్టుకుంది. జెడ్పీ సెంటర్ వద్ద ప్రదర్శనపై పూల వర్షం కురిపించారు. పైలాన్ వద్ద సి.పి.ఐ పతాకాన్ని సి.పి.ఐ సీనియర్‌ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, ఆవిష్కరించగా ఎ.ఐ.టి.యు.సి.

all so read :- అంతిమ విజయం కమ్యూనిస్టులదే.. పువ్వాడ

పతాకాన్ని కూనంనేని ఆవిష్కరించారు. సి.పి.ఐ నిర్వహించిన ప్రదర్శన నగర వీధులను ఎరుపెక్కించింది. ప్రదర్శన అగ్రభాగాన సి.పి.ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేనిసాంబశివరావు, సి.పి.ఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ తదితరులు నడువగా కవాత కు సి.పి.ఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు సిద్దినేని కర్ణకుమార్,జానిమియా, యర్రాబాబు, తోటరామాంజనేయులు నేతృత్వం వహించారు. మహిళల కోలాటదళం, ప్రజానాట్యమండలి డప్పుదళాలు సందడి చేశాయి.
== ‘యోధుని యాధిలో ‘ టైటిల్ ఆవిష్కరణ
సి.పి.ఐ రాష్ట్ర సమితి సభ్యులు,జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి అమరజీవి మందడపు నాగేశ్వరరావు చరిత్రను ‘యోధునియాధిలో ‘ పేరిట పుస్తక రూపంలో తీసుకరానున్నారు. పార్టీ ఆవిర్భాదినోత్సవాన్ని పురస్కరించుకొని టైటిల్ ను సి.పి.ఐ బహిరంగసభావేదిక పై ఆవిష్కరించారు. సి.పి.ఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావులు టైటిల్ ను ఆవిష్కరించగా ఈ కార్యక్రమంలో సి.పి.ఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, నాగేశ్వరరావు సతీమణి, రైతుసంఘం నాయకురాలు మందడపు రాణి పుస్తక రచయిత తళారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.