ఖమ్మంరూరల్ సీఐ నీ తోలు తీస్తాం: కూనంనేని
ఖమ్మం రూరల్ సీఐ పై ద్వజమెత్తిన సీపీఐ రాష్టృ కార్యదర్శి కూనంనేని
ఖమ్మంరూరల్ సీఐ నీ తోలు తీస్తాం: కూనంనేని
** హత్యలు చేపిస్తావా..?
** నీలాంటోళ్ళను బొచ్చేడుమందిని చూసినం
** నిన్ను వదలం..వదిలే వరకు వెంటపడతాం
** ఖమ్మం రూరల్ సీఐ పై ద్వజమెత్తిన సీపీఐ రాష్టృ కార్యదర్శి కూనంనేని
(ఖమ్మం రూరల్-విజయం న్యూస్)
ఖమ్మం రూరల్ సీఐ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక రెంజీలో ఫైర్ అయ్యారు. సీఐ నీ తోలు తీస్తాం అంటూ ఫైర్ అయ్యారు. హత్యలు చేయిస్తారా.. కమ్యూనిస్టులను కదిలించే శక్తివంతుడివా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు.
ఇది చదవండి:- పాలేరు నియోజకవర్గానికి శుభవార్త
భారత కమ్మ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికై మొదటిసారి జిల్లాకు వచ్చిన సందర్భంగా పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్ లో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం అనంతరం కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ
ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ ఖిల్లా అని అన్నారు.ఈ నేల నల్ల నేల కాదు, త్యాగాల రక్తాలతో తడిచిన నేల అని పునరుద్ఘాటించారు.తెలంగాణ సారధిగా నేను అయ్యానంటే, మీ కృషి ఫలితమేనని, అందరికి ధన్యవాదములు తెలిపారు. ఎర్రజండాలన్నింటిని ఒకే తాటిపై తెచ్చేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి:- సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు ఎన్నిక.
** ఖమ్మం రూరల్ సిఐ జాగ్రత్త
ఖమ్మం రూరల్ సీఐ నీకి సిగ్గు ఎగ్గూ లేదా..? అని ప్రశ్నించారు. మా నాయకుడు ఓ విషయంలో పిటిషన్ ఇవ్వడానికి వస్తే.. ఇలా పిటిషన్లు ఇవ్వడం వల్లనే తమ్మినేని కృష్ణయ్య ను హత్య చేశారని బెదిరిస్తావా.. నువ్వే హత్య చేయించావా..?హత్యలు చెపిస్తావా నువ్వు, సురేష్ ను చంపేస్తారా..? ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉద్యోగం చేయి.. అంటూ ఘాటుగా హెచ్చరించారు. చొక్కాలు విప్పి కొడతానని అంటున్నావంటగా.. నీకు దమ్ముందా..?నీ చేతనైతదా..? పోలీస్ డ్రెస్ వేసుకుని మాట్లాడటానికి నీకు సిగ్గు అనిపించడం లేదా..?పార్టీ కార్యకర్తకు చిన్న నలుసు పడ్డా మా తడాఖా చూపిస్తాం… చొక్కాలు విప్పి కొడతాం.
నీ వెంట పడతాం…. ఎంతో మంది ఐపీఎస్ లను చూసాం.
*నీ చుట్టరికం ఉంటే ఇంట్లో చూపించుకో..జనంలో కాదు. ఆవేశంగా మాట్లాడటం లేదు. ఆలోచన చేసి మాట్లాడుతున్నాం.. ఎవడు చెబితే వాడి మాట విని మా కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తావా.. ఏం ఒక్కరికి ఇబ్బంది జరిగిన వదలం..నిన్ను అసలు వదిలేది లేదు… వెంటపడ్డాడు ఇక్కడ నుంచి వదిలేసే వరకు వదలం అంటూ సీఐ పై మండిపడ్డారు.
*ఇది కూడా చదవండి:-18న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు పౌరసన్మానం
*భాగం హేమంతారావు కామెంట్స్….*
ఖమ్మం రూరల్ సిఐ గారు అధికారిగా వ్యవహరించండి….
ఒకవేళ రాజకీయాలు చేయాలనుకుంటే మీ కోటు విప్పి చేయండి….
కంమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలపై మీ తీరు సరిగ్గా లేదు…
ఎంతో మంది అధికారులను ఎర్రజెండా చూస్తూ వస్తుంది….
కమ్యూనిస్ట్ లను తెరమరుగు చేయాలంటే మీ వల్ల కాదు