Telugu News

బీజేపీ హటావో దేశ్ కీ బచావో పేరుతో సీపీఐ బస్ యాత్ర: కూనంనేని

పాలకులు ఏవరైనా ప్రజలకు సేవకులు మాత్రమే

0

బీజేపీ హటావో దేశ్ కీ బచావో పేరుతో సీపీఐ బస్ యాత్ర: కూనంనేని

== పాలకులు ఏవరైనా ప్రజలకు సేవకులు మాత్రమే

== ప్రభుత్వాలు దేశ ప్రయోజనాలను ఆలోచించాలి

== విలేకర్ల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)

బీజేపీ హటావో దేశ్ కీ బచావో పేరుతో సీపీఐ ఆధ్వర్యంలో బస్ యాత్ర చేస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడారు.

ఇధి కూడా చదవండి:- పేదల కళ్ళలో ఆనందం నింపాలనే.. కంటి వెలుగు.

నేడు దేశంలో రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు చూస్తున్నాం

ముఖ్యంగా అదానీ, అంబానిలకు దేశ ఆర్థిక వ్యవస్థను అప్పచెప్పెందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోంది

సాదరంగా ప్రతిపక్షాలు గగ్గోలు పెడతారు కానీ అధికార పక్షం గగ్గోలు పెట్టడం అదో వింత

పాలకులు ఎవరైనా దేశ ప్రయోజనాలు ఉండాలి

అదానీ 13 లక్షల కోట్ల కుంభకోణం వెనుక బీజేపీ ప్రభుత్వం హస్తం ఉంది

ఇది కూడా చదవండి:-;ఢిల్లీలో తిరంగా మార్చ్ నిరసన.. హాజరైన ఖమ్మం ఎంపీలు

విజయ్ మాల్యా, నిరవ్ మోడీ, లలిత్ మోడీ ల వెనుక బీజేపీ ఉంది వీరి వలన దేశానికి 14 లక్షల కోట్ల నష్టం

బీజేపీ ఈ.డీ, సీబీఐ లను వాడుకుని ప్రతి పక్షాలను భయబ్రాంతులకు గురి చేస్తుంది

ఎంత అవినీతి చేసిన వారైనా బీజేపీ లోకి వెళ్తే వారు పునీతులవుతారు

ఎక్కడో కాదు మన తెలంగాణ రాష్ట్రంలో టీ.ఎస్.పీ.ఎస్ వాస్తవాలను తెలుసుకునేందుకు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

కానీ 10వ తరగతి పేపర్ లీకేజి వ్యవహారంలో బండి సంజయ్ పేరు రాకుంటే రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లెందుకు బీజేపీ యత్నిస్తోంది

నిఘా వ్యవస్థ ఎందుకు విఫలమైంది అని అడిగేవారు విజయ్ మాల్యా, నీరవ్ మోడిల సమయంలో ఎక్కడికి వెళ్ళింది

పేపర్ లీకేజిల వ్యవహారంలో దోషులు ఎవరైనా వారిని శిక్షించి తీరాలి

బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసేందుకు యత్నిస్తోంది

ప్రధాని నరేంద్ర మోడీ మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు

సింగరేణి నీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సీపీఐ పార్టీ ఎన్నో ఆందోళనను చేస్తే వారు విరమించుకున్నారు

ఇది కూడా చదవండి:- బండి సంజయ్ విడుదల

రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ఆందోళనలు నిర్వహిస్తాం

విభజన హామీలో ఏ ఒక్క హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదు

వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ పై మాట్లాడేందుకు రాని ప్రధాని వందే భారత్ రైలు ప్రారంభోత్సవానికి వస్తారా

బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలకు అభివృద్ధికి సహకరించరా

మే 18 న కొత్తగూడెంలో 1 లక్ష మందితో భారీ బహిరంగ సభ

సీపీఎం సీపీఐ పార్టీలు గత రెండు పర్యాయాలు కలిసి పోటి చేయలేదు కానీ ఈ ఎన్నికల్లో మా రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాం

అసెంబ్లీలో ఏదో ఒక పద్ధతిలో స్థానం సంపాదించేందుకు ప్రయత్నం చేస్తాం

ఇటివల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఇచ్చిన నష్టపరిహారం సరిపోదు, మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం స్వేచ్చ కల్పించాలి

ఇది కూడా చదవండి,:-కేటీఆర్ ను భర్తరఫ్ చేయాలి : బండి సంజయ్

మునుగోడు ఎన్నిక తర్వాత కూడా నాపై 3 కేసులు నమోదయ్యాయి

సీతారామ ప్రాజెక్ట్ ఆలస్యాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం గమనించి త్వరితగతిన పూర్తి చేయాలి

బీజేపీకి హటావో దేశ్ కి బచావో అనే నినాదంలా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరించం

రెండు పార్టీలు కలిసి పోవడమే మా ముందు ఉన్న లక్ష్యం

మా పొత్తులో ఇద్దరం మాకు అనుగుణంగా గౌరవపరంగా ఉన్న పార్టీకే మద్దతు ఇస్తాం

మాకు కొన్ని కోట్ల మంది ఓటర్లు ఉన్నారు