ధరల పెరుగుదలను నిరసిస్తూ సిపిఎం విన్నూతన నిరసన
ట్రాలీ ఆటోని తాళ్లతో లాగుతూ గ్యాస్ బండ్ ను ఊరేగింపు ప్రజా పోరాటాల పరిష్కార మార్గం సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
ధరల పెరుగుదలను నిరసిస్తూ సిపిఎం విన్నూతన నిరసన
ట్రాలీ ఆటోని తాళ్లతో లాగుతూ గ్యాస్ బండ్ ను ఊరేగింపు
ప్రజా పోరాటాల పరిష్కార మార్గం
సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
(ఖమ్మం – విజయం న్యూస్):-
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యజనం పై కక్ష గట్టినట్టు గా అన్ని రకాల వస్తువుల ధరలు పెంచడాన్ని నిరసిస్తూ సిపిఎం ఖమ్మం త్రీటౌన్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు టౌన్ వ్యాప్తంగా 10 డివిజన్లలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.
ఈ సందర్భంగా 36వ డివిజన్ లో గాంధీ చౌక్ సెంటర్లో ట్రాలీ ఆటో కి తాళ్ళు కట్టి లాగుతూ ఆటో పై గ్యాస్ బండ ఊరేగింపు చేస్తూ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉప్పు, పప్పు, నూనె, కూరగాయలు, రీటేల్ సరుకులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ మొదలగు అన్ని రకాల ధరలు 50 నుంచి 60 శాతం పెరిగాయన్నారు. అత్యవసర మందులు కూడా ధరలు పెంచి బిపి, జ్వరం, గుండెజబ్బులు, షుగర్ మొదలగు అత్యవసర మందుల ధరలు కూడా అందుబాటులో లేకుండా చేశారన్నారు. గ్యాస్ సిలిండర్ ధర రూ1000/- దాటించారు. ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు సైతం విపరీతంగా పెరిగాయి.
ALSO READ :- కరెంట్ బిల్లుల పెంపు పై ఇల్లందులో ధర్నా
దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ చార్జీలు, ఆర్టీసీ బస్సు టికెట్ చార్జీలు పెంచిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచడం లో ప్రజలను ఇబ్బందులపాలు చేయడానికి పోటీపడుతున్నాయని పేర్కొన్నారు. మరోపక్క కరోనా కష్టకాలంలో పనులు కోల్పోయి చేస్తున్న పనులకు సరైన ఆదాయం రాక అనేక ఇబ్బందులు పడుతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు భారాలు మోపుతూ మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. ఇంకోపక్క శత కోటీశ్వరులు లక్షల కోట్ల రాయితీలు ఇస్తూ వారి ఆదాయాలను మరింత పెంచుకుంటూ పోతున్నారు. విధానాల పరంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలతోనే సాగుతున్నాయని ఈ ధరల పెరుగుదల ఆగాలంటే మరోసారి విద్యుత్ పోరాటం సమరశీల పోరాటాలు నిర్వహించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ప్రజలు ఈ పోరాటంలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్ మాట్లాడుతూ పోరాడకుండా నేటికీ ఏ సమస్యలు పరిష్కారం కాలేదని, పోరాటాలే పరిష్కారం మార్గం అని ప్రజలంతా సమరశీల పోరాటం లోకి రావాలని పిలుపునిచ్చారు.
ALSO READ :- మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చిత్రపటానికి ముస్లింలు క్షీరాభిషేకం
ఈ కార్యక్రమాల్లో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎర్ర శ్రీనివాస రావు, త్రీ టౌన్ కార్యదర్శి భూక్య శ్రీనివాసరావు, కార్యదర్శివర్గ సభ్యులు తుశాకుల లింగయ్య, వజినేపల్లి శ్రీనివాసరావు, ఎస్ కే సైదులు, కార్పొరేటర్ లు ఎర్ర గోపి, యల్లంపల్లి వెంకటరావు, ఎస్.కె ఇమామ్, పత్తిపాక నాగ సులోచన, శీలం వీరబాబు, బండారు వీరబాబు, టౌన్ నాయకులు పాశం సత్యనారాయణ, ఎస్ కె బాబు, వేల్పుల నాగేశ్వర రావు, రంగు హనుమంత చారి, పోతురాజు జార్జి, ఎస్.కె మస్తాన్, జి పుల్లయ్య పున్నయ్య, దాదాసాహెబ్, మేడ బోయిన లింగయ్య, సిద్దెల రాజు, తమ్మి నేని రంగారావు, ఆవుల శీను, పండగ ఎంకన్న, కృష్ణ, శ్రీ శైలం, వెంకట నారాయణ, కోడి వెంకన్న, మట్టిపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.