Telugu News

నైజాం’ మోడీ: పోతినేని సుదర్శన్

వీరతెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ ముగింపు సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని, జిల్లా కార్యదర్శి నున్నా

0

నైజాం‘ మోడీ: పోతినేని సుదర్శన్ 

– రజాకార్లను మించిన బీజేపీ దోపిడీ

– నిజాం దొరలకు…బీజేపీ కార్పొరేట్లకు…

– హిందూ ముస్లిం విభజనకే విమోచన

– వీరతెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ ముగింపు సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేనిజిల్లా కార్యదర్శి నున్నా

ఖమ్మంసెప్టెంబర్‌17(విజయంన్యూస్):     

నైజాంను మించి అరాచకాలకు ప్రధాని నరేంద్రమోడీ పాల్పడుతున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావుజిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. రజాకార్లను మించి బీజేపీ దోపిడీ పాలన సాగుతోందన్నారు. నిజాం దొరలకు దోచిపెడితే…మోడీ కార్పొరేట్లకు కట్టబెడుతున్నాడని ఆరోపించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించి హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టించేందుకు బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు.

allso read- టీఆర్ఎస్, బీజేపీలకు స్వాతంత్రపై మాట్లాడే హక్కులేదు: భట్టి విక్రమార్క

ఖమ్మం త్రీటౌన్‌ ప్రాంతంలోని గ్రెయిన్‌ మార్కెట్‌ యార్డులో శనివారం ఏర్పాటు చేసిన వీర తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ ముగింపు సభలో వారు మాట్లాడారు. కష్టజీవుల తరఫున కమ్యూనిస్టులు చేసిన పోరాట ఫలితంగా తెలంగాణలో గ్రామ స్వరాజ్య స్థాపన మొదలైందన్నారు. ఈ పోరాటంలో ఇసుమంతైనా పాత్రలేని బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో వేడుకలు జరపడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సాయుధ పోరాటాన్ని హిందువులు ముస్లిం రాజుపై చేసిన యుద్ధంగా చిత్రీకరిస్తూ విమోచన దినోత్సవం పేరుతో చరిత్రను వక్రీకరించిప్రజలను పక్కదోవ పట్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ముస్లింలపై పోరాటమైతే బందగీషోయబుల్లాఖాన్‌ముగ్దూం మొహినొద్దీన్‌…వంటివారు ఎందుకు సాయుధ పోరాటంలో భాగమయ్యారో చెప్పాలని బీజేపీ నేతలను ప్రశ్నించారు. నైజాంనెహ్రూ సైన్యాల మధ్య యుద్ధం జరిగితే ఒక రక్తపు బొట్టుకూడా రాలకుండా హైదరాబాద్‌ సంస్థాన విలీనం ఎలా సాధ్యమైందన్నారు. ఈ యుద్ధంలో నిజాం ఓడిపోతే ఎన్నో వేల మందిని పొట్టన పెట్టుకున్నందుకు ఆయన్ను శిక్షించాలి కానీ రాజప్రముఖ్‌’ బిరుదుతో ఎందుకు సత్కరించినట్లని ప్రశ్నించారు. రూ.కోట్ల విలువ చేసే భరణాలుఆభరణాలు నిజాంకు ఎందుకు ఇచ్చినట్లు అన్నారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఫలితంగా గ్రామాలు కమ్యూనిస్టుల వశమవుతున్నాయనే దుగ్దతో కాంగ్రెస్‌బ్రిటిష్‌పాకిస్తాన్‌ జాతీయ నేత జిన్నానిజాం ప్రభువు ఏకమై తెలంగాణ సంస్థానాన్నిభారతదేశంలో విలీనం చేసినట్లు చెప్పారు. భూమిభుక్తివెట్టిచాకిరి విముక్తి కోసం సాగిన సాయుధ పోరాటంలో భాగంగా నాలుగు వేల మంది కమ్యూనిస్టులు ప్రాణార్పణ గావించారన్నారు. వీరిలో ఖమ్మం జిల్లాకు చెందిన చిర్రావూరి లక్ష్మీనర్సయ్యమంచికంటి రాంకిషన్‌రావుసర్వదేవభట్ల రామనాథంకేఎల్‌ నర్సింహారావుబోడేపూడి వెంకటేశ్వరరావుతమ్మినేని సుబయ్య… వంటి వేలాది మంది యోధులు ఉన్నారన్నారు. హోంమంత్రిగా నెహ్రూ సైన్యాన్ని ముందుకు నడిపిన వల్లభాయ్‌ పటేల్‌ను కూడా చివరకు బీజేపీ తమ నాయకుడిగా చెప్పుకోవడం వారి వక్రబుద్ధికి నిదర్శనమన్నారు.

allso read- ఖమ్మంరూరల్ సీఐ నీ తోలు తీస్తాం: కూనంనేని

సెప్టెంబర్‌ 10న చాకలి ఐలమ్మ  వర్ధంతి సందర్భంగా ప్రారంభమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సభలను విలీన దినోత్సవం నేపథ్యంలో శనివారం నాటితో ముగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పోరాట ఫలితంగా భూసంస్కరణలు అమల్లోకి వచ్చి దున్నేవాడికి భూమి దక్కిందన్నారు. 38ఈ వంటి కౌలుదారి చట్టం వచ్చిందన్నారు. పోరాట ఫలితంగా సాధించుకున్న చట్టాలను బీజేపీ కాలరాస్తోందన్నారు. దున్నే భూములుప్రజల ఆస్తులను కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతోందన్నారు. ఫలితంగా అంబానీఅదానీ వంటి కార్పొరేట్లు ప్రభుత్వ రంగ సంస్థలను ధారాదత్తం చేసుకుంటూ ప్రపంచ కుబేరులుగా ఎదిగారన్నారు. రోడ్డురైల్వేలుఓడరేవులువిమానాశయ్రాలు ఇలా ఒకదాని వెంట ఒకటి బీజేపీ కార్పొరేట్లకు కట్టబెడుతోందని దుయ్యబట్టారు. హిందూ ముస్లిం విభజన కోసమే బీజేపీ విమోచన దినోత్సవం నిర్వహిస్తోందన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్యాణం వెంకటేశ్వరరావురాష్ట్ర నాయకులు ఎం.సుబ్బారావుజిల్లా కమిటీ సభ్యులు యర్రా శ్రీనివాస్‌బండారు రమేష్‌తుమ్మా విష్ణువన్‌టూత్రీటౌన్‌ కార్యదర్శులు ఎంఏ జబ్బార్‌బోడపట్ల సుదర్శన్‌భూక్యా శ్రీనివాస్‌అర్బన్‌ నాయకులు ఎస్‌కే మీరాకార్పొరేటర్లు యర్రా గోపియల్లంపల్లి వెంకట్రావ్‌త్రీటౌన్‌ నాయకులు వజినేపల్లి శ్రీనివాసరావుబండారు యాకయ్యపత్తిపాక నాగసులోచనశీలం వీరబాబుబండారు వీరబాబుఎస్‌కే సైదులుఎస్‌కే ఇమామ్‌పాశం సత్యనారాయణకార్మిక నాయకులు చంద్రగాని రామ్మూర్తిమల్లారెడ్డివీరస్వామివెంకటేశ్వరరావుపీరయ్యనల్లమాసు వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

allso read- 18న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు పౌరసన్మానం