Telugu News

రైతుల ఉసురు తీస్తున్న మోడీ : సీపీఎం

దేశంలో మళ్లీ కమ్యూనిస్టులు బలపడతారు

0

రైతుల ఉసురు తీస్తున్న మోడీ

కమ్యూనిస్టులు బలపడతారు 

 సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు  

(ఖమ్మం-విజయం న్యూస్)

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల ఉసురు తీస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు అన్నారు మంగళవారం ఖమ్మం మంచికంటి భవనంలో ఖమ్మం అర్బన్ మండలం 8వ మహాసభ ఎర్రబోయిన ఉపేందర్ గుర్రం కృష్ణయ్య గద్దల రత్తమ్మ మొక్కపాటి నాగమణి  అధ్యక్షతన జరిగింది ఈ మహాసభలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకు వచ్చి వ్యవసాయ రంగాన్ని అంబానీ  అదానీలకు కట్టబెట్టాలని చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు 10 నెలలుగా ఢిల్లీ సరిహద్దులలో రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతుంటే కార్లు వెక్కించి తొక్కించి చంపుతున్నారని విచారం వ్యక్తం చేశారు ప్రతి ఏటా కోటి ఉద్యోగాలు ఇస్తామని పరిశ్రమలు నెలకొల్పి ఉద్యోగ భద్రత కల్పిస్తామని నల్ల డబ్బు వెలికి తీస్తామని అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ఒక్క హామీ నెరవేర్చకపోతే ప్రభుత్వ సంస్థలన్నింటినీ కారుచౌకగా కార్పొరేట్ శక్తులకు అమ్ముతున్నారని తెలిపారు బిజెపికి వ్యతిరేక పవనాలు మొదలయ్యాయని రాబోయే ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో చిత్తుచిత్తుగా ప్రజలు ఓడించటం ఖాయమన్నారు మతోన్మాదాన్ని సృష్టిస్తూ అధికారం వెళ్లబుచ్చుతున్న బిజెపి ఆర్ ఎస్ ఎస్ విధానాల పట్ల ప్రజలు అర్థం చేసుకుంటున్నారని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో దోపిడి పాలన కొనసాగుతుందని నరేంద్ర మోడీ  కేసీఆర్ ఇద్దరు సంపన్న వర్గాలకు ఊడిగం చేస్తున్నారని తెలిపారు  దేశ వ్యాప్తంగా కమ్యూనిస్టులు బలపడుతున్నారన్నారు . భవిష్యత్తులో ప్రత్యామ్నాయం కమ్యూనిస్టులే అన్నారు. తొలుత మహాసభ జెండా ను సీనియర్  గద్దల పెంటయ్య ఆవిష్కరించారు.   ఈ మహాసభలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్, జిల్లా కమిటీ సభ్యులు ఎర్ర శ్రీనివాసరావు, టిి. విష్ణు వర్ధన్,  మెరుగు సత్యనారాయణ, టి. లింగయ్య,  నాయకులు ముదాం శ్రీనివాసరావు, భూక్య శ్రీను,  ఎస్ కె నాగులు మీరా, ముమ్మడి పుష్పవతి,  పద్మ తదితరులు పాల్గొన్నారు

సమావేశంకు సంబంధించిన పోటోలను క్రింద చూడగలరు