సిపిఆర్- ప్రాణం పోసే ప్రక్రియ:గిరిసింహ
== ఆర్టీసీ సీనియర్ మెనికల్ ఆఫీసర్ డా.ఎ.వి.గిరిసింహారావు
(ఖమ్మం-విజయంన్యూస్)
హార్ట్ ఎటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్ (అకస్మాత్తుగా గుండె స్పందన ఆగిపోయి, అచేతనంగా, స్పృహ కోల్పోయి అపస్మారక స్ధితిలో పడిపోవడం) కేసులు వృద్ధుల్లోనే కాదు మధ్యవయస్సులో, యుక్తవయస్సులో కూడా పెరిగిపోతున్నాయి. దానికి ముఖ్యకారణాలు. ఒత్తిడి, అధికబరువు, శారీరకశ్రమ లేక పోవడం, నియంత్రణలోలేని షుగరు, బిపి, కొలెస్టరాల్, పొగాకు వస్తువులు, మద్యపానం, నగరీకరణ. వీటివలన ‘కరొనరీ’ “ఆర్టరీ డిసీజ్” అంటే గుండెకు సరఫరా చేసే రక్తనాళాలు చెడు కొలెస్టరాల్ వల్ల పూడుకుపోవడం. ఇలా అకస్మాత్తుగా గుండె కొట్టుకోవడం ఆగిన పేషెంట్స్ ని గమనించి నప్పుడు వెంటనే ఉద్యుక్తులమై “సీపీఆర్” అనే ప్రక్రియని నిర్వర్తించినప్పుడు గుండె మళ్లీ స్పందించే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువ. సీపీఆర్ (హృదయ పునః చేతన’ ప్రక్రియ)ని అర్వీసీ ఉద్యోగులు, ప్రయాణికులు, హెల్త్ వాలంటీర్స్, ఔత్సాహికులు అందరూ శాస్త్రీయంగా నేర్చుకోవాలని. దానివలన హార్ట్ ఎటాక్ కి గురయిన పేషెంట్స్ కి ప్రాణభిక్ష పెట్టవచ్చని వైద్యాధికారి తెలిపారు. సిపిఆర్ ఎలా చేయాలో కత్రిమ శరీరం మీద చేసి ప్రయోగాత్మకంగా వివరించారు. ఖమ్మం నూతన బస్టాండ్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆర్టీసి ఉద్యోగులు, ప్రయాణికులు పాల్గొన్నారు. త్వరలో ఖమ్మం రీజియన్ లోని ఆరు డిపోలలో సేసిఆర్ ప్రదర్శనని నిర్వహించి తర్ఫీదునిస్తామని ఖమ్మం వైద్యాధికారి తెలిపారు
ఇదికూడా చదవండి: పొంగులేటికి ‘దయ’ చూపడం లేదా..?