Telugu News

తిమ్మారావుపేటలో ముగిసిన క్రికెట్ పోటీలు

క్రికెట్ విజేతలకు బహుమతులు

0

తిమ్మారావుపేటలో ముగిసిన క్రికెట్ పోటీలు

== క్రికెట్ విజేతలకు బహుమతులు

ఏన్కూర్ – మే 7(విజయం న్యూస్)

ఏన్కూరు మండలం తిమ్మారావుపేట గ్రామంలో గత ఐదు రోజులుగా జరుగుతున్న జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు మంగళవారం సాయంత్రంతో ముగిశాయి. ప్రథమ బహుమతిని చీమలపాడు గెలుచుకోగా, రెండవ బహుమతిని ఎర్రబోడు తండా గెలుచుకుంది. ప్రథమ బహుమతి క్రింద 20 వేల రూపాయలను దాత బానోత్ వీరు నాయక్ చేతుల మీదుగా అందజేశారు. ద్వితీయ బహుమతి క్రింద 10 వేల రూపాయలను దాతలు భూఖ్య జగ్యా, భూఖ్య రవి లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు డి.ఆర్.కె బి వినోద్ కుమార్, భూక్య హరిదాస్, భూక్య నరసింహారావు, బాదావత్ నరసింహారావు, భూక్య చంటి, బానోత్ నరసింహారావు, మాలోత్ చిరంజీవి, కేలోత్ జగ్యా, బాదావత్ లక్ష్మ, భూక్య రమేష్ తదితరులు పాల్గొన్నారు.