జిహ్వ చేపలని అవకాశంగా మార్చకొన్నారు.
* నిషేదిత క్యాట్ ఫిష్ తరలిస్తుండగా అదుపులోకి
* క్యాట్ ఫిష్ తింటే కిడ్ని రోగాలొస్తాయి.
అన్నపురెడ్డిపల్లి/అశ్వారావుపేట విజయం న్యూస్)
జిహ్ చేపలని ,అవకాశంగా మార్చుకొన్నారు కొందరు.వివరాలలోకి వెళ్లితే భద్రాచలం సరిహద్దులో చత్తీస్‌గఢ్ ,ఒరిస్సా రాష్ట్రాలుంటాయి. .వీరికి చేపలంటే ప్రీతి.ఎక్కువుగా చేపలను తింటారు.సరిగ్గా ఈ చాపల్యాన్ని సొమ్ము చేసుకోవాలని కొందరు నిషేదిత క్యాట్ ఫిష్ ను కేజి 15/₹ రుపాయలకు గోదావరి ప్రాంతములొ కొని ,బద్రాచలం బోర్డర్ లొ 150/—200/₹ లకు అమ్ముతుంటారు.
also read :-రోడ్డు ప్రమాదంలో గాయపడిన వనజీవి రామయ్య
ఈ విదంగా ఏలూరు నుండి బద్రాచలానికి ఈ చేపలను బొలేరొ లొ తరలిస్తుండగా ,అన్నపురెడ్డి పల్లి మండలం లొ పోలీసులు వాహనాలను తనఖీ చేస్తు , అనుమానస్పధంగా ఉండటం,క్యాట్ ఫిష్ అనే అనుమానంతో ఆ బొలేరొ ను స్వాదీనం చేసుకొని,సందేహ నివ్రుత్తి కోసం ఫిషరీస్ డిపార్ట్మెంట్ ను సంప్రదించగా,వారు వచ్చి ఇవి నిషేధిత క్యాట్ ఫిష్ గా గుర్తించారు.దీంతో వ్యాను డ్రైవర్ తో పాటు ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీసులు కేసు నమోదు చేసారు. అదే విదంగా వ్యాన్ ను సీజ్ చేసారు.పట్టుబడిన క్యాట్ ఫిష్ ను పెద్ద గొయ్య తీసి కప్పేట్టారు.
మత్స్య శాఖాదికారుల వివరణ
బద్రాద్రి కొత్తగూడెం జిల్లా మత్స్య శాఖ ఫీల్డ్ ఆఫీసర్ కోటేశ్వరరావు ను వివరణ కోరగా.అన్నపురెడ్డిపల్లి పోలీస్ నుంచి తమకు కబరు వచ్చిందని,తాము వెల్లి పరిశీలింగా,అవి నిషేదిత క్యాట్ ఫిష్ అని తెలిపారు.వీటిని ఆహరంగా తీసుకొంటే కిడ్నివ్యాదులు,చర్మరోగాలు వస్తాయని,అందుకే వీటిని నిషేదించి నట్లు తెలిపారు.