Telugu News

అతివేగంతో వస్తున్న ఇసుక లారీ అదుపుతప్పి బోల్తా

ములుగు జిల్లా  విజయం న్యూస్

0
  1. అతివేగంతో వస్తున్న ఇసుక లారీ అదుపుతప్పి బోల్తా

 (ములుగు జిల్లా  విజయం న్యూస్ ):-
ములుగు జిల్లా మంగపేట మండలం బోర్ నర్సాపురం గ్రామం లో ప్రమాదం జరిగింది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,పినపాక మండలం, జానంపేట ఇసుక క్వారీ నుండి అధికంగా ఇసుక లోడుతో హైదరాబాద్ వెళ్తున్న ఇసుక లారీ మంగపేట మండలం బోర్ నర్సాపురం గ్రామంలో గేదెలు అడ్డురావడంతో అధిక వేగంగా వస్తున్న ఇసుక లారీ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని డి కొట్టుకున్న వెళ్లి లోయలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

also read :-ఈనెల 27 న మేడారం లో ఆదివాసి మహిళ సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నికను విజయ వంతం చేయాలి

కానీ లారీ మాత్రం పెద్ద మొత్తంలో డ్యామేజ్ కి గురయింది. ప్రమాదానికి గురైన ఇసుక లారీ హైదరాబాద్ కు సంబంధించినది గా సంబంధిత లారీ డ్రైవర్ చెప్పుకొచ్చారు. గ్రామస్తులు మాత్రం అధిక బరువు,అతివేగం ఈ కారణంగానే ప్రమాదం జరిగిందని,ఇలాంటి ప్రమాద సంఘటనలు పలుసార్లు జరుగుతున్న అధికారులు మాత్రం ఇసుక లారీల అధికబరువును, వేగం నియంత్రణను అదుపు చేయడం లేదు అని అన్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అధిక బరువుతో అతివేగంగా వెళ్తున్న ఇసుక లారీలను నియంత్రించి మరల ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని గ్రామస్తులు కోరారు.