Telugu News

సత్తుపల్లిలో విషాదం.. మొన్న కొడుకు.. నేడు తండ్రి మృతి.

** కుమారుడి ఖననం చేసిన చోటే ఉరేసుకుని తండ్రి ఆత్మహత్య

0

సత్తుపల్లిలో విషాదం.. మొన్న కొడుకు.. నేడు తండ్రి మృతి
** కుమారుడి ఖననం చేసిన చోటే ఉరేసుకుని తండ్రి ఆత్మహత్య
(సత్తుపల్లి -విజయం న్యూస్);-

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో విషాదం నెలకొంది.. కుమారుడు చనిపోయాడని తట్టుకోలేని తండ్రి ఆయన కూడా ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా విషాదాచాయలు అలుముకున్నాయి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే. సత్తుపల్లికి చెందిన రాంబాబు కుటుంబం ఖమ్మంలో నివాసం ఉంటున్నారు. ఖమ్మం లోని మమత హాస్పిటల్ సమీపంలో ఉన్న హార్వెస్ట్ స్కూలు లో రాంబాబు కుమారుడు భాను ప్రకాష్ పదో తరగతి చదువుతున్నాడు.

ఈ నెల 14న స్నేహితులతో కలిసి జన్మదిన వేడుకల్లో పాల్గొనగా, ఈ వేడుకలపై త్రీవంగా స్పందించిన స్కూల్ యజమాన్యం భాను ప్రకాష్ ను మందలించారు. అంతే కాకుండా వారం రోజుల పాటు సస్పెండ్‌ చేశారు. ఈ పరిణామాలతో మనస్తాపం చెందిన భానుప్రకాష్ ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో తక్షణమే అతడిని హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 16న సాయి మృతిచెందాడు. కాగా భాను ప్రకాష్ స్వగ్రామం సత్తుపల్లిలో అంత్యక్రియలు పూర్తి చేశారు.

అయితే కుమారుడి మరణంతో తండ్రి రాంబాబు తీవ్ర ద్రిగ్భాంతికి గురైయ్యాడు. రెండు రోజుల పాటు అన్నంపానియాలు ముట్టని తండ్రి రాంబాబు రాత్రి 11గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లాడు. ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురైయ్యారు. ఆయన ఆచూకి కోసం గాలించారు.
** తండ్రి ఖననం వద్దనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న తండ్రి
రాంబాబు ఆసూకి కోసం వెతుకుతున్న సందర్భంలో చుట్టుపక్కల వారు రాంబాబు ఆచూకి గురించి తెలిపారు. కుమారుడిని ఖననం చేసిన ప్రాంతంలోనే చెట్టుకు ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడని చెప్పడంతో కుటుంబ సభ్యులు హాటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని చూశారు. దీంతో విగతజీవిగా కనిపించి రాంబాబును చూసి కుటుంబ సభ్యులు గుండెలు అలిసేలా రోధించారు. ఈ ఘటనతో సత్తుపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తండ్రి కొడుకుల మరణానికి కారణమైన హార్వెస్ట్ స్కూల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, స్కూల్ యాజమాన్యం పై కేసు నమోదు చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

also read:-ముప్ఫై ఏండ్లుగా చీకట్లో మగ్గుతున్న బాటన్న నగర్