Telugu News

దళిత వ్యక్తులపై దాడి.

కులం పేరుతో దూషిస్తూ చితకబాదిన వైనం.

0

దళిత వ్యక్తులపై దాడి

కులం పేరుతో దూషిస్తూ చితకబాదిన వైనం.

రఘునాధపాలెం విజయ న్యూస్:
ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం ఈర్లపుడి గ్రామానికి చెందిన దళిత వ్యక్తులపై చలమల లక్ష్మయ్య అనే బిసి వర్గానికి చెందిన వ్యక్తి అమానుషంగా దాడి చేసి గాయ పరిచిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఈర్లపుడి గ్రామానికి చెందిన వెలుతురు భాస్కర్, వరపర్ల శిలవరాజు అనే వ్యక్తులు పంగిడి గ్రామంలోని అమ్మ చెరువుకు చేపలవేటకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో చెరువు పక్కనే ఉన్న చలమల లక్ష్మయ్య కు సంబంధించిన గుంటలో చేపలు పట్టారు అనే అనుమానంతో ఇద్దరు వ్యక్తులను చితకబాదాడు.

బాధితులు మీ గుంటలో పట్టలేదని చెరువులో గాలాలు వేశామని ఆవేదన వ్యక్తం చేస్తున్న కనీసం పట్టించుకోకుండా కులం పేరుతో దూషిస్తూ లేబర్ వాళ్లు, జాతి తక్కువ వాళ్ళు,అంటూ అనేక అసభ్య పదజాలంతో దూషిస్తూ తన వద్ద ఉన్న కర్రతో విచక్షణరహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. సంబంధిత బాధితులు రఘునాధపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన నిందితుడు కుటుంబ అధికార బలంతో కేసు తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనలో మాకు న్యాయం జరగకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని సంబంధిత బాధిత కుటుంబాలు తెలియజేశారు.

a.lso read ;- ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ కే పట్టంకట్టారు : మాజీ ఎంపీ పొంగులేటి