Telugu News

పంటల పోషణకు సేంద్రియ పదార్థం అవసరం

== సేవ్ సాయిల్ వాల్ పోస్టర్లను అవిష్కరించిన టీఆర్ఎస్ నాయకులు

0

పంటల పోషణకు సేంద్రియ పదార్థం అవసరం

== సేవ్ సాయిల్ వాల్ పోస్టర్లను అవిష్కరించిన టీఆర్ఎస్ నాయకులు

(కూసుమంచి-విజయం న్యూస్);-
పంటల పోషణకు సేంద్రియ పదార్థం చాలా అవసరమని, తద్వారా పంట దిగుబడి పెరిగే అవకాశం ఉందని, అంతే కాకుండా పంట వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉందని రైతుబంధు సమితి మండల మాజీ అధ్యక్షుడు జొన్నలగడ్డరవికుమార్ అన్నారు. సోమవారం కూసుమంచి మండల కేంద్రంలోని గణపేశ్వరాలయంలో ఇషా వారి ఆధ్వర్యంలో సేవ్ సాయిల్ వాల్ పోస్టర్స్ ను టీఆర్ఎస్ నాయకులు, రైతులు అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇషా వారి ఆధ్వర్యంలో సేవ్ సాయిల్ అనే నినాదంతో ప్రతి సెకనుకు ఒక ఎకరం నేల ఎడారిగా మారుతుందన్నారు.

also read :-తెలంగాణ ప్రభుత్వం హాయంలోనే మధిర పట్టణాభివృద్ది

పంటల పోషణకు మట్టిలోని సేంద్రియ పదార్థం ఎంతో అవసరమని, ప్రకృతిని సంరక్షించడంలో అత్యంత ముఖ్యమైన అంశం మట్టి అని అన్నారు. మట్టి క్షీణించడం అరికట్టకపోతే ఈ గ్రహం ఇక మనిషికి నివాసయోగ్యంగా ఉండదన్నారు. సద్గురు మట్టిని పునరుజ్జీవింపజేసే అవసరం పై అవగాహనను పెంచడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో రాజారావు, వై నవీన్, కూసుమంచి రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ఎండీ. అజీజ్, బారి వీరభద్రం, గుండా దామోదర్ రెడ్డి, కూరపాటి వేణు, గుండా మహిపాల్ రెడ్డి, కొండా మహిపాల్,అర్వపల్లి వెంకటేశ్వర్లు, కొనారెడ్డి,మంద విష్ణు,అర్వపల్లి జనార్దన్ గౌడ్, అర్వపల్లి సతీష్,ఎండీ.రఫీ, తిరుపతి రావు,వంగాల ఉపేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు