Telugu News

పంట క”న్నీళ్ళ”పాలు

అకాల వర్షంతో తడిసిన పంట

0

ఎడతెరిపిలేని వర్షంతో పంటకు నష్టం
-ఆందోళన చెందుతున్న రైతులు

ఏన్కూరు, మార్చి 17 (విజయం న్యూస్)

ఏన్కూరు మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. భారీ ఈదురు గాలులతో, ఉరుములు, మెరుపులు, పిడుగుల శబ్దాలతో భారీ వర్షం కురిసింది. అకాల వర్షం మూలంగా మిర్చి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది.

ఇది కూడా చదవండి:- రాష్ట్రంలో వర్ష సూచన.. భయపడుతున్న రైతులు

చాలా చోట్ల మిర్చి తడిసి పోయింది. కల్లాల్లో ఆరబోసిన మిర్చి పై పరదాలు కప్పి ఉంచినప్పటికీ ఈదురు గాలులు వర్షం మూలంగా ఫలితం లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిర్చి చుట్టూ నీళ్లు చేరాయి. మండలంలో ఈ ఏడాది సుమారు 8 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ఎకరానికి లక్ష రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. తెగుళ్ల మూలంగా పంట దెబ్బతిని దిగుబడులు తగ్గిపోయాయి. ధర ఆశాజనకంగా ఉన్నప్పటికీ దిగబడులు తగ్గిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే అకాల వర్షం మిర్చి రైతుల్ని మరింత దెబ్బతీసింది ఇక మొక్కజొన్న చాలాచోట్ల నేలకొరిగింది కేసుపల్లి, టిఎల్ పేట, తిమ్మారావుపేట, జన్నారం, బిఆర్ పురం తదితర గ్రామాల్లో మొక్కజొన్న సాగు చేశారు.

ఇది కూడా చదవండి:- కేసీఅర్ నీ గద్దె దింపే దమ్ము నీకుందా: మంత్రి పువ్వాడ

ఈ గ్రామాల్లో ఈదురు గాలులు మూలంగా మొక్కజొన్న నేలకొరిగింది. ఏన్కూరు వ్యవసాయ మార్కెట్లో మిర్చి బస్తాలు సైతం తడిసిపోయాయి. ప్రభుత్వం స్పందించి పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని రైతులు, రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.