*అకాల వర్షాలతో నీటిపాలైన పంటలు: సీతక్క
నష్ట పోయిన ప్రతి రైతుకు ఎకరాకు 50 వేల నష్ట పరిహారం చెల్లించాలి
*అకాల వర్షాలతో నీటిపాలైన పంటలు: సీతక్క
*క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపండి
== నష్ట పోయిన ప్రతి రైతుకు ఎకరాకు 50 వేల నష్ట పరిహారం చెల్లించాలి
== కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
(ములుగు-విజయం న్యూస్)
గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ములుగు నియోజక వర్గం లో వరి,మొక్క జొన్న,మిర్చి తో పాటు ఇతర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయినీ జిల్లా అధికారులు క్షేత్ర స్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించి నష్ట పరిహారం ఎకరాకు 50 వేలు ప్రతి రైతుకు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం వాటిల్లుతుంది అని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్ట నివారణ చర్యలు తీసుకొని రైతుల ను ఆదుకోవాలని సీతక్క డిమాండ్ చేశారు
ఇది కూడా చదవండి:- ఛత్తీస్‌గఢ్‌లో జవాన్లపై మావోయిస్టుల ఘాతకం