Telugu News

దమ్ముంటే  సత్తుపల్లి లో పోటీ చేసి గెలవాలి: ఎమ్మెల్యే సండ్ర

కుల  మత రాజకీయాలు ముస్కు రాజకీయాలు చేస్తున్న వ్యక్తులను నమ్మొద్దు ఎమ్మెల్యే సండ్ర*

0
దమ్ముంటే  సత్తుపల్లి లో పోటీ చేసి గెలవాలి: ఎమ్మెల్యే సండ్ర
== గత ఎన్నికల్లో డిపాజిట్లు దక్కని వారు నాపై ఆరోపణలు చేయటం విడ్డూరంగా ఉంది
==కుల  మత రాజకీయాలు ముస్కు రాజకీయాలు చేస్తున్న వ్యక్తులను నమ్మొద్దు ఎమ్మెల్యే సండ్ర*
== సత్తుపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ని గెలిపించాలి.. ఎమ్మెల్సీ తాత మధు
 == నిరంతరం ప్రజలతో ఉండి ప్రజలకు కోసం పాటుపడే వ్యక్తి పక్షాన నిలబడతా: పార్థసారధి రెడ్డి
== రైతుల పక్షపాతం ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ ని రాబోయే ఎన్నికల్లో దీవించాలి:  వద్దిరాజు రవిచంద్ర
(సత్తుపల్లి-విజయంన్యూస్):

గత 15 సంవత్సరాల నుంచి సత్తుపల్లి ప్రజలు నా వ్యక్తిత్వాన్ని నా విలువలను గుర్తించినారు కాబట్టే మూడుసార్లు విజయాలు అందించారు అని, గత రెండు ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు రాని వ్యక్తి నాపై ఆరోపణలు చేయటం విడ్డూరంగా ఉందని, కులం ఒకటైతే  వేరే కులం పేరు చెప్పి గెలవలేదని, నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ అందరిని కలుపుకుపోతున్నానని, ఏ మతానికో ఏ కులానికో పక్షాన నేను ఎప్పుడూ నిలవలేదని ఆయన అన్నారు. ఆదివారం మండల పరిధిలోని గంగారం గ్రామంలో వాసు రెడ్డి నందు ఫంక్షన్ హాల్ నందు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య అధ్యక్షతన నిర్వహించిన*ఆత్మీయ సమ్మేళనం సభలోపక్క రాష్ట్రంలో కోడిపందాలకు ,పేకాటలకు వెళ్ళేది మీరే, నేను ఏనాడు పేకాటకు కానీ, కోడిపందాలు కానీ, వెళ్లలేదని, వెళ్లినవారు ఎవరైతే ఉన్నారో వారి వీడియోలు నా దగ్గర ఉన్నాయి సమయం సందర్భం వాటిని ప్రజలకు వివరిస్తామన్నారు, ఎలాంటి తప్పు చేయలేదని అసాంఘిక కార్యక్రమాలకు నేను పాల్పడనని మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే  వచ్చే ఎన్నికల్లో మీ నాయకుడు పక్షాన సత్తుపల్లిలో పోటీ చేసి గెలవాలని ఆయన కోరారు, మీ పైన విశ్వసనీయత లేకపోవటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మీకు స్థానిక  గా స్థానం  కల్పించలేదని గుర్తుపెట్టుకోవాలని,

ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు, ప్రజలకు మంచి చేసే వ్యక్తులను సత్తుపల్లి ప్రజలు వివేకవంతులు మంచి చేసే వ్యక్తిని రాబోయే ఎన్నికల్లో ఎన్నుకుంటారని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు  ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు,
 జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు తాతా మధు మాట్లాడుతూ*,
 ప్రజలకు మంచి చేసే వారి పక్షాన నిలవాలని సత్తుపల్లి ప్రజలు వివేకవంతులని, ఇప్పటికే సండ్ర వెంకట వీరయ్య హట్యీక్ విజయాలు అందించిన సత్తుపల్లి ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు, వచ్చే నవంబర్, డిసెంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య కి మూడు విజయాలతో పాటు నాలుగో విజయం అందించాలని , సత్తుపల్లి గడ్డ పై బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు, ఖమ్మం జిల్లాలో బీ ఆర్ఎస్ పార్టీ పైన స్థానిక శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పైన ప్రతిపక్షాలు  చేస్తున్న ఆరోపణలపై మేము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని, ధైర్యం ఉంటే మాపై ఆరోపణలు నిరూపించడానికి సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు, జిల్లాలో కొందరు సీతారామ ప్రాజెక్టుపై నీళ్లు రావు అని నిరాధారా  ఆరోపణలు చేయటం,  మీటింగ్   స్టేజి పైన ఆరోపణ చేయటం స్టేజి దిగిన తర్వాత కాంట్రాక్టులు దక్కించుకోవడం ఫ్యాషన్ గా మారిందన్నారు,
*అనంతరం రాజ్యసభ సభ్యులు, బండి పార్థసారథి రెడ్డి మాట్లాడుతూ* రాత్రింబవులు తేడా లేకుండా ప్రజా శ్రేయ కోసం నిరంతరం కష్టపడె మంచి నాయకుడు సండ్ర వెంకట వీరయ్య రానున్న ఎన్నికల్లో సండ్ర వెంకట వీరయ్య తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆశీర్వదించాలని ఆయన కోరారు, రాజ్యసభ సభ్యులుగా సత్తుపల్లి నియోజకవర్గానికి అనేక నిధులు కేటాయిస్తామని సత్తుపల్లి అభివృద్ధికి తన శక్తి మేరకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన అన్నారు, గడిచిన 15 సంవత్సరాల నుంచి సండ్ర వెంకట వీరయ్య పై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని మంచి చేసే వ్యక్తి పక్షాన మీరందరూ ఉండి సండ్ర వెంకట వీరయ్య గెలుపుకి  కృషి చేయాలని ఆయన కోరారు, ఈ ఆత్మీయ సమ్మేళనాలు తో పల్లెల్లో పండగ వాతావరణం నెలకొన్నాయి, కొత్త సాంప్రదాయానికి తేర తీసినా ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కృతజ్ఞతాభినందనలు తెలిపారు,
*అనంతరం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు  రవిచంద్ర మాట్లాడుతూ* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులు పక్షపాతిగా రైతులకు పెద్దపీట వేసి, రైతుబంధు రైతు బీమా తో పాటుగా నిన్న మొన్న వర్షాలు కు  దెబ్బతిన్న పంటలకు  రైతు సోదరులకు,పాటు గా కౌలు రైతు సోదరులకు కూడా 10,000 ఆర్థిక సహాయం అందించటం గొప్ప విశేషం, అన్నారు, బిజెపి, ఇతర రాజకీయ పార్టీలు మీ వద్దకు వచ్చినప్పుడు వారి వారి రాష్ట్రాలలో అభివృద్ధిని వివరించమని అడగండి ప్రశ్నించండి అని అన్నారు, కేంద్ర ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల పైన మోయలేని భారం మోపిందని పెట్రోల్ గ్యాస్ ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయన్న, సత్తుపల్లి ప్రజలు మీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పక్షాన నిలిచి సత్తుపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కృషిచేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞత పూర్వకంగా వ్యవహరించాలని ఆయన కోరారు,
*అనంతరం స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ,*
ఈ కార్యక్రమంలో జిల్లా  డిసియమ్ యస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, జడ్పిటిసి సభ్యులు కూసం పూడి రామారావు, ఎంపీపీ దొడ్డ హైమావతి శంకర్రావు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ తోట సుజలా రాణి, ఆత్మ కమిటీ చైర్మన్ వనమా వాసు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మోనార్క రఫీ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, యాగంటి శ్రీనివాసరావు, జడ్పిటిసిల మండల అధ్యక్షులు తుంబురు కృష్ణారెడ్డి, సర్పంచ్  సంఘం మండల అధ్యక్షుడు మందపాటి శ్రీనివాసరెడ్డి, సత్తుపల్లి సొసైటీ చైర్మన్ కృష్ణయ్య,  గంగారం సొసైటీ చైర్మన్ మందపాటి వెంకటరెడ్డి, శ్రీలపురెడ్డి హరికృష్ణ రెడ్డి, పెనుబల్లి ఎంపీపీ  అక్కినేని అలేఖ్య , పెనుబల్లి జడ్పిటిసి సభ్యులు చెక్కిలాల మోహన్రావు, కల్లూరు మండల టిఆర్ఎస్ అధ్యక్షులు పాలేపు  రామారావు, జడ్పిటిసి సభ్యులు కట్టా అజయ్ బాబు, పలువురు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, సర్పంచులు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు,……..