Telugu News

గిరిజన గ్రామాలలో ఆర్ఎంపీల దందా

* మంత్రాలు తంత్రాలు అమాయక ప్రజలే లక్ష్యం

0

గిరిజన గ్రామాలలో ఆర్ఎంపీల దందా
* మంత్రాలు తంత్రాలు అమాయక ప్రజలే లక్ష్యం
* వైద్యులకు డబ్బు జబ్బు
* గిరిజనుల ప్రాణాలతో చెలగాటం 

(కరకగూడెం – విజయం న్యూస్)
మండల పరిధిలోని మారుమూల గిరిజన గ్రామ ప్రజలే లక్ష్యంగా కొందరు ఆర్ఎంపీలు దోపిడీ పర్వానికి తెరలేపారు వైద్యం పేరిట అమాయకమైన గిరిజనుల నుంచి వేల రూపాయలు దండుకుంటున్నారు చిన్న, పెద్ద వ్యాధులకు సూది మందు ఇచ్చే ఆర్ఎంపీలు పెద్ద పెద్ద రోగాలకు కూడా వైద్యం చేస్తూ రోగులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు, మండల పరిధిలోని కొన్ని గ్రామాల్లో ఆర్ఎంపీలు చేసిన వైద్యం వికటించి ప్రాణాలు కోల్పోయిన వారన్నారు ఇంకా కొందరు శంకర్ దాదాలు గ్రామీణ ప్రాంతాల్లో వారి ఉనికిని కోల్పోతామని చెప్పి అవసరం లేకున్నా శాస్త్ర చికిత్సలు చేస్తున్నారు. వైద్యం   ముసుగుణ కొందరు ఆర్ఎంపీలు పట్టణాలలోని కార్పొరేట్ వైద్యశాలకు రోగులను తరలిస్తూ డబ్బులు దండుకుంటున్నారు అని, ఏజెన్సీలో వచ్చీరాని వైద్యంతో శంకర్ దాదాలు సరేగాని చెలరేగిపోతున్నారు, సీజనల్ వ్యాధులు దృష్టిలో పెట్టుకుని జబ్బు కోరేటి విధిస్తూ వేల రూపాయలు దండుకున్నారని, కనీస విద్యార్హత లేకున్న గ్రామాల్లో వైద్యుల అవతారం ఎత్తి లక్షలు నడుస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. జబ్బు చేస్తే ప్రభుత్వ వైద్యశాలలో ఆశ్రయించకుండా ఆర్ఎంపీ డాక్టర్ ల ను నమ్ముతూ గిరిజన ప్రజలు వారి వారి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఏజెన్సీలో పరిపాటిగా మారాయి జ్వరం వస్తే మరణమే అన్న చందాగా గిరిజనుల బ్రతుకులు మారుతున్నాయి అని, పట్టించుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం గ్రామీణ ప్రాంతాల్లో పరిపాటిగా మారింది, నిత్యం వందల సంఖ్యలో ప్రజలు ప్రైవేట్ వైద్యశాల ను నమ్ముకొని జేబులు గుల్ల చేసుకుంటున్న వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఆర్ఎంపీలు వచ్చీరాని వైద్యం మంత్రాలు అంటూ అమాయక గిరిజనులను మోసం చేస్తున్నారని, ప్రతి ఏడాది గ్రామీణ వైద్యులు చేస్తున్న నిర్లక్ష్యానికి అనేకమంది బలి పశువు అవుతున్నారని కేవలం ప్రథమ చికిత్స వైద్యం చేయకూడదనే నిబంధన లో ఉన్న వైద్యం చేస్తూ గిరిజనులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి ఏజెన్సీలో ప్రభుత్వ వైద్యపై అవగాహన కల్పించి ఆర్ఎంపీల చేతిలో మోసపోకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.