Telugu News

నర్సింహులగూడెం రోడ్డులో డెంజర్ బెల్స్.

** రోడ్డు అంచుభాగం కొట్టుకపోయి కూలిపోతున్న బీటీ రోడ్డు.

0

నర్సింహులగూడెం రోడ్డులో డెంజర్ బెల్స్
** రోడ్డు అంచుభాగం కొట్టుకపోయి కూలిపోతున్న బీటీ రోడ్డు
** రెండు నెలలవుతున్న పట్టించుకుని ఆ శాఖాధికారులు
** స్టాఫ్ బోర్డు పెట్టి వదిలేసిన పోలీసులు
** రాత్రి వేళ్లలో గుంతల్లో పడిపోతున్న వాహనాలు
(కూసుమంచి –విజయంన్యూస్):-
నాలుగు జిల్లాలకు అనుసంధానమైన రహదారి.. నిత్యం వందలాధి వాహనాలు రాకపోకలు చేస్తున్న రాష్ట్రీయ రహదారి.. ప్రస్తుతం క్షణం తీరక లేకుండా నేషనల్ హైవే కోసం అతి బరువైన వాహనాలు తిరుగుతున్న రోడ్డు.. ప్రయాణికుల సౌలభ్యం కోసం నిర్మాణం చేసిన డబుల్ రోడ్డు కాస్త సింగిల్ రోడ్డుగా మారింది.. వరదలు వచ్చిన సందర్భంలో వంతెనపై బీటీ రోడ్డు కొట్టుకపోయిన సందర్భంలో రోడ్డు అంచుబాగాల వరదకు కోత కోసి చాలా డెంజర్ గా ఉన్నాయి.. చికటి పడితే చాలు ప్రమాదఘటికలను మోగిస్తున్న ఈ రహదారి ఎక్కడో లేదు.. నిత్యం వందలాధి మంది ప్రయాణించే రహదారిలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కూసింత దూరంలో ఉంది.. అయినప్పటికి సంబంధిత అధికారులకు చీమ కుట్టినట్లుగా కూడా లేదు.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఏదైనా పెద్ద ప్రమాదం జరిగే వరకు రహదారి

శాఖాధికారులకు కండ్లు కనిపించవనుకుంటా..?

సంబంధిత శాఖాధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించేవారు కరువైయ్యారు.. ఎక్కడ ప్రమాదం జరుగుతుందోనన్న భయంతో పోలీసులు చిన్నపాటి పాడుబడిన స్టాఫ్ బోర్డును పెట్టి చేతులు దులుపుకున్నారు.. మనుషుల ప్రాణాలంటే రహదారి శాఖాధికారులకు అంత చిన్నచూపైంది.. కనీసం సంబంధిత పంచాయతీ పాలకులైనా పట్టించుకుంటారంటే.. వాళ్లకు పట్టంది మనకేందుకులే పక్కంటి బాధలు మనకేందుకు అన్నట్లు వ్యహరిస్తున్నారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గం, కూసుమంచి మండలంలోని పాలేరు – మరిపేడ బంగ్లా రహదారి నాలుగు జిల్లాలకు అనుసంధానమైన రహదారి.. వరంగల్ జిల్లా, మహుబుబాబాద్ జిల్లా, ఖమ్మం, సూర్యపేట జిల్లాలకు చెందిన ప్రయాణికుల రాకపోకలకు ఇది చాలా దగ్గరమార్గమైంది. ముఖ్యంగా పాలేరు గ్రామంలో ప్రతి శుక్రవారం సంత జరుగుతుంది. ఈ సంత రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచింది కావడంతో అనేక జిల్లాల నుంచి ఈ రోడ్డు నుంచి ప్రయాణికులు, ప్రజలు రాకపోకలు చేస్తుంటారు. అందుకే ఈ రహదారి నిత్యం రద్దిగా ఉంటుంది.. అలాంటి రహదారికి పెద్ద సమస్య వచ్చిపడంది.. అదేంటంటే..?

** కోతకు గురైన రోడ్డు..

పాలేరు నుంచి మరిపేడ బంగ్లా వెళ్లే రహదారి నర్సింహులగూడెం పంచాయతీ శివారు నాన్ తండా వద్ద వంతెన ఉంది. గత రెండు నెలల క్రితం భారీగా వర్షాలు వచ్చి వరదలు రావడంతో వంతెన పై నుంచి నీళ్లు ప్రవహించాయి. ఆ వరద ప్రభావానికి వంతెన పై నిర్మాణం చేసిన రోడ్డు కొట్టకపోయింది. అలాగే రోడ్డుకు ఇరువైపుల వరద ఉదత్తికి రోడ్డు కోతకు గురైంది.. దీంతో చాలా ప్రమాదకరంగా మారింది. సమీపంలోనే మూలమలుపు ఉండటంతో పెద్దలోతులో గుంతలుండటంతో ప్రమాదం పొంచి ఉంది. చికటి పడితే ఆ రహదారి కోతకు గురైన ప్రాంతం కనిపించదు. వాహనదారులు జాగ్రత్తగా ఉంటే తప్ప ఆ కోతకు గురైన ప్రాంతం కనిపించే అవకాశం లేదు. అలాగే నిత్యం వాహనాలు వస్తుండటంతో క్షణం తీరకలేకుండా పెద్దపెద్ద వాహనాలు నడుస్తున్నాయి.. ఏ క్షణానైనా రోడ్డు కుదించే అవకాశం లేకపోలేదు.

** చిన్న స్టాఫ్ బోర్డు పెట్టిన పోలీసులు

కోతకు గురైన రహాదారి ప్రాంతంలో ప్రమాదం పొంచి ఉందని భావించిన పోలీసులు పాత స్టాఫ్ బోర్డులను ఏర్పాటు చేశారు. దీంతో వాహనదారులు కొంత వరకు స్లో చేసుకునే అవకాశం ఉంది. అయితే స్టాఫ్ బోర్డు ఒకవైపు రోడ్డుపై పెట్టడంతో ఇప్పుడు డబుల్ రోడ్డు కాస్తా సింగిల్ రోడ్డుగా మారింది. నిత్యం క్షణం తీరక లేకుండా తిరుగుతున్న టిప్పర్లకు వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఏ క్షణానైన ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదని స్థానికులు, ప్రయాణికులు వాపోతున్నారు.

** రెండు నెలలైన పట్టించుకని అధికారులు

పాలేరు-మరిపేడ బంగ్ల రహదారిలోని నాన్ తండా సమీపంలో రోడ్డు కోతగు గురై పెద్ద గుంతలు పడి డెంజర్ బెల్స్ ను మోగిస్తున్నాయి.. అయినప్పటికి సంబంధిత శాఖాధికారులు పట్టించుకన్న పాపాన పోలేదు.. అలాగే పంచాయతీ అధికారులు కూడా ఆ ప్రమాదం జరిగే ప్రాంతాన్ని పట్టించుకోకుండా వదిలేశారు. తద్వారా ఏ క్షణానైన పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకే ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు. మీర ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందిస్తారా..? వేచి చూడాల్సిందే..?

also read :- సమ్మెకు మావోయిస్టుల మద్దతు.

 

please subscribe this chanel smiling chaithu