డప్పు వాయించిన మంత్రి అజయ్
** ఖమ్మంలో షూరు అయిన నిరసన కార్యక్రమం
** డప్పువాయిద్యాలతో నిరసన ర్యాలీ..
** భారీగా తరలివచ్చిన జనం
(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్):-
తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్రం ప్రభుత్వం అవలంభిస్తున్న అనుచిత విధానాలపై తెరాస రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండల కేంద్రంలో నిరసనలు నిర్వహించారు.
నిరసన కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని డప్పు వాయిస్తూ ర్యాలీ చేశారు.. ఆయనతో పాటు నాయకులు డప్పు వాయించారు. ఈ సంధర్భంగా జరిగిన ధర్నాలో మంత్రి మాట్లాడారు..
రైతులకు న్యాయం జరిగే వరకు, కేంద్రం దిగివచ్చే వరకు కేంద్రప్రభుత్వంపై చావు డప్పు మోగించాలని పిలుపునిచ్చారు.
కేంద్రం అవలంభించే రాష్ట్ర వ్యతిరేక విధానాలను ప్రజలకు అర్థమయ్యేలా వివారిస్తామన్నారు.
కేంద్రం వచ్చే యాసంగిలో ఉప్పుడు బియ్యం కొనమని చెప్పిన విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలన్నారు.
నిరసన కార్యక్రమంలో భాగంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కేంద్రం ప్రభుత్వం చావుకు డప్పు మోగించారు.
అనంతరం కేంద్రప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు..
also read :-అల్పా (విషా) హారం..?