Telugu News

దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి : కందాళ

పాలేరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి

0

దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి : కందాళ

== పాలేరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి

(కూసుమంచి-విజయంన్యూస్)

దశాబ్ది ఉత్సవాలను ఘనంగా  పటిష్టంగా నిర్వహించాలని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం పాలేరు బీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో అధికారులతో దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై ఆయా శాఖల అధికారులు తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కెసిఆర్ నేత్రుత్వంలో తెలంగాణ అభివృద్ధి సాధించ్చిందని, విజన్ ఉన్న ముఖ్యమంత్రి అన్నారు. 9ఏళ్ల కాలంలో అభివృద్ధి ఫలాలు ప్రజలకు వివరించాలని తెలిపారు.

ఇది కూడా చదవండి: పాలించడం మనకు చేతకాదా..:ఎమ్మెల్యే కందాళ

ఈ క్రమంలో ప్రభుత్వం రాష్ట్ర దశాబ్ది అవతరణ దినోత్సవాలను 21 రోజులపాటు నిర్వహించుటకు నిర్ణయించిందని, రోజువారి కార్యక్రమాలు సూచించిందని అన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ, అమరుల సంస్మరణ, గ్రామపంచాయతీ అమరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ తీర్మానం చేయాలి, మౌనం పాటించాలి.  9వ హరితహారం కార్యక్రమం పెద్దఎత్తున చేపట్టాలని, ప్లాంటేషన్ స్థలాలను గుర్తించి, ప్లాంటేషన్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. మంచి నీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు.ప్రభుత్వం నుంచి నిధులు రాకున్నా సొంతంగా మంజూరి చేస్తామన్నారు. ఎవ్వరికి ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేస్తామన్నారు. నియోజకవర్గం లో ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమలు అన్ని శాఖలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. కార్యక్రమంలో ఏసీపీ బస్వారెడ్డి, ఐబీ ఈఈ వెంకటేశ్వర్లు, డీప్యూటీ డిమ్హెచ్ వో రాంబాబు, వ్యవసాయశాఖ ఏడీ విజయచంద్ర, తిరుమలాయపాలెం ఎంపిడిఓ, సీడీపీఓ బాలత్రిపుర సుందరి,ఆర్ డబ్ల్యూ ఎస్ ఈ ఈ, ఎఫ్ ఆర్ వో సురేష్, కూసుమంచి ఎంపిడిఓ కరుణాకర్ రెడ్డి, ఎంఈవో రామాచారీ తమ శాఖల ద్వారా చేపట్టానున్న కార్యాచరణ వివరించారు. కార్యక్రమంలో కూసుమంచి ఎంపీపీ బానోత్ శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ శేఖర్, ఆత్మ చైర్మన్ బాలకృష్ణ రెడ్డి పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: “కందాళ”కు పరీక్షే నా..?