Telugu News

జిల్లాలో దయాకర్ రెడ్డి పర్యటన

మమత రోడ్డులో ఆరా డ్యాన్స్ స్కూల్ ప్రారంభం

0

*జిల్లాలో దయాకర్ రెడ్డి పర్యటన*

*- మమత రోడ్డులో ఆరా డ్యాన్స్ స్కూల్ ప్రారంభం*

*- పలు వివాహ వేడుకలకు హాజరు*

(ఖమ్మం-విజయం న్యూస్):

తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి జిల్లాలో ఆదివారం పర్యటించారు. నగరంలోని మమత ఆస్పత్రి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఆరా డ్యాన్స్ స్కూల్ ను ప్రారంభించారు. మంచి నృత్య ప్రదర్శనల శిక్షణతో నిర్వాహకులు చక్కటి ఆదరణ పొందాలని దయాకర్ రెడ్డి ఆకాంక్షించారు.

ఇది కూడా చదవండి:- ఖమ్మం లో బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి నామినేషన్..ఎవరంటే..?*

అనంతరం 59వ డివిజన్ దానవాయిగూడెంలో మద్దెల నారాయణ కుమారుడు, ఖమ్మం రూరల్ మండలం సాయిప్రభాత్ నగర్ లోని చల్లపల్లి గార్డెన్స్ లో తుమ్మ నాగచంద్రారెడ్డి కుమారుడు, మద్దులపల్లిలో తూమాటి నారాయణ కుమారుడు, ఖమ్మం నగరంలోని వాసవి గార్డెన్స్ లో జబ్బూరి రమణారెడ్డి కుమారుని పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. పట్టు వస్త్రాలను కానుకగా సమర్పించి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. అదేవిధంగా కారేపల్లిలో ఇమ్మడి తిరుపతిరావు ఇంట్లో జరిగిన ఉప్పలమ్మ వేడుకలో, ఖమ్మం నగరంలోని 60వ డివిజన్ రామన్నపేటలో జరిగిన పంచెకట్టు వేడుకకు హాజరె చిన్నారులను ఆశీర్వదించారు.*