Telugu News

కేంద్ర ప్రభుత్వంపై చావు డప్పు కొట్టిన వైరా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

** వైరాలో నిరసన.. రాస్తారోకో.. దిష్టిబొమ్మదగ్ధం

0

కేంద్ర ప్రభుత్వంపై చావు డప్పు కొట్టిన వైరా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
** వైరాలో నిరసన.. రాస్తారోకో.. దిష్టిబొమ్మదగ్ధం
( వైరా – విజయం న్యూస్ );-

కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తే వేసవిలో వరి ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను నిర్లక్ష్యం చేస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిరంకుశ వైఖరిని ఎండగడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో భాగంగా వైరా నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో గ్రామ గ్రామాన, మండల కేంద్రాలలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించి బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై చావు డప్పు కొట్టి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వైరా మండల కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతామధుసూధన్ తో కలిసి వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పాల్గొన్నారు. బిజెపి కేంద్ర విధానాలపై చావు డప్పును మోగించిన నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అండగా ఉంటూ యావత్ దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో రైతులకు చేయూత ఇచ్చేందుకు రైతులకు మద్దతుగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే బిజెపి కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతు వ్యతిరేక నిర్ణయాలతో సీఎం కేసీఆర్ నుండి రైతుల దూరం చేసేందుకు రైతుల పై కక్ష సాధింపు చేస్తుందని, తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ అని, గౌరవ కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రైతులు పండించిన పత్తికి గింజను కొనుగోలు చేసే వరకు రైతులకు మద్దతుగా ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు, రైతుల ఉసురు తో బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని తెలంగాణ దెబ్బకి కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం, బిజెపి నాయకులు అబ్బ అనాల్సిందేనని, కెసిఆర్ పవర్ ఏంటో కేంద్ర ప్రభుత్వాలకు బాగా తెలుసని అన్నారు.

ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడలు వంచి అయినా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కెసిఆర్ గన్యాయం చేస్తారని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులకు మార్గదర్శిగా వ్యవసాయంలో అద్భుత ఫలితాలు చేస్తున్న తెలంగాణపై బిజెపి రాష్ట్ర కేంద్ర నాయకులు కుట్రలు చేసి తెలంగాణ రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నారని తెలిపారు. రైతుల ఉసురు పోసుకున్న ఏ ప్రభుత్వం బాగు పడలేదని రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర కేంద్ర నాయకులకు తగిన బుద్ధి చెప్పి గుణపాఠం చెబుతామని, బుద్ధిలేని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇకనైనా తొండి మాటల ఆపాలని తాతా మధుసూదన్ హితవు పలికారు

ఈ కార్యక్రమంలో వైరా నియోజకవర్గ రైతన్నలు , టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు , కార్యకర్తలు , ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్కుఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, ఏఎంసీ చైర్మన్ గుమ్మ రోశయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, వైరా ఎంపీపీ వేల్పుల పావని, జెడ్పిటిసి నంబూరి కనకదుర్గ, మండల పార్టీ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, వైరా టౌన్ పార్టీ అధ్యక్షులు ధర్నా రాజశేఖర్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పసుపులేటి మోహన్ రావు, కొనిజర్ల జడ్ పి టి సి కవిత, మండల పార్టీ అధ్యక్షులు యాండ్రాప్రగడ చిరంజీవి, కొనిజర్ల రైతు బంధు మండల కమిటీ కన్వీనర్ కిలారు మాధవరావు, జిల్లా నాయకులు పోట్ల శ్రీనివాసరావు, ప్రజా స్థానిక నాయకులు పాల్గొన్నారు.

also read:- ప్రజలకు తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్.