Telugu News

అప్పుల వల్ల  ఆత్మహత్య చేసుకున్న రైతు  కుటుంబాన్ని ఆదుకోవాలి

◆◆ జిల్లా కిసాన్ కాంగ్రెస్ మొక్క  శేఖర్ గౌడ్  

0

అప్పుల వల్ల  ఆత్మహత్య చేసుకున్న రైతు  కుటుంబాన్ని ఆదుకోవాలి

 

◆◆ జిల్లా కిసాన్ కాంగ్రెస్ మొక్క  శేఖర్ గౌడ్  

 

(ఖమ్మం ప్రతినిధి- విజయంన్యూస్)

 

తిరుమలాయపాలెం మంగలి బండ తండా లో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు  మొక్క శేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .శుక్రవారం  ఆత్మహత్య చేసుకున్న ధరావత్ బాలాజీ కుటుంబాన్ని పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రైతుల ఆత్మహత్యలు పెరిగాయని రైతులను ఆదుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని  తెలంగాణ వచ్చాక రైతుల పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశించాం కానీ అత్యంత దుర్భరంగా మారాయని  ఈ సంవత్సరం రైతులు తమ మిర్చి  తోటలకు తామర పురుగు పట్టడం వల్ల ఎకరానికి  లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయి అప్పులపాలైనారు

also read :-కమీషన్ల కోసం వడ్ల కొనుగోలు కేంద్రాలు నడిపితే ఉపేక్షించేది లేదు

అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి  రైతులకు స్పెషల్ ప్యాకేజీ ప్రకటించి తామర పురుగు వల్ల నష్టపోయిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు  కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలని కిసాన్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం  తెలంగాణ  వచ్చాక రైతుల పరిస్థితి దుర్భరంగా మారింది కల్వకుంట్ల వారి కుటుంబం మాత్రం మూడు పూలుఆరుకాయలుగా అభివృద్ధి చెందుతున్నదని  రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి రైతు మేలు కోరే కాంగ్రెసు ప్రభుత్వం తెచ్చుకోవాలని

also read :-అశ్వారావుపేట లో టాస్క్ ఫోర్స్ మెరుపుదాడులు

రుణమాఫీ ఒకేసారి చేయకపోవడం వల్ల గ్రామాల్లో రైతులకు డబుల్ బెడ్రూంలు లేకపోవడం వల్ల ఎక్కువగా రైతులు అప్పులపాలవుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు  కావున రుణమాఫీ ఒకేసారి ప్రకటించాలని అదేవిధంగా డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  ఇంకా ఈ కార్యక్రమంలో మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు బాజీ సత్యనారాయణ మంగళితండా గ్రామ  కాంగ్రెస్ నాయకులు ధరావత్ మురళి,  ధరావతు శంకర్, రావత్ కృష్ణ, గార్ల రాజశేఖర్ గౌడ్   తదితరులు పాల్గొన్నారు.