Telugu News

రుణం తీర్చుకుంది..!

👉కన్నతల్లికి తలకొరివి పెట్టిన కూతురు

0

రుణం తీర్చుకుంది..!

👉కన్నతల్లికి తలకొరివి పెట్టిన కూతురు

(బూర్గంపహాడ్ -విజయం న్యూస్ );-

బూర్గంపాడు మండల కేంద్రమైన బూర్గంపాడు లోని అంబేద్కర్ కాలనీకి చెందిన కొండ్రు సావిత్రి (86) అనే వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మృతి చెందింది. మృతురాలు కుమారులు ఇరువురు చనిపోయారు.మృతురాలికి అంత్య క్రియలు నిర్వహించేందుకు కుమారులు ఎవరూ లేకపోవడంతో చిన్న కూతురు వెంకటరమణ తన తల్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకువచ్చారు. కన్నతల్లికి వెంకటరమణ తలకొరిమి పెట్టి కన్న తల్లి రుణం తీర్చుకుంది. నవమాసాలు మోసి కని,పెంచిన కన్నతల్లి రుణాన్ని తీర్చుకున్న వెంకటరమణ పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

also read :-దళిత వ్యక్తులపై దాడి.