Telugu News

రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించాలి: మంత్రి పువ్వాడ

సమీక్ష సమావేశంలో అధికారులకు ఆదేశించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

0

రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించాలి: మంత్రి పువ్వాడ

== సమీక్ష సమావేశంలో అధికారులకు ఆదేశించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

(ఖమ్మం-విజయం న్యూస్)

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహించాలని, రాష్ట్రంగా ఏర్పడిన అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు.

ఇది కూడా చదవండి:- అట్టహాసంగా ‘దశాబ్ది’ సంబురాలు చేద్దాం: మంత్రి

ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్  వీ.పీ.గౌతమ్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్సవాల సన్నాహక సమావేశంలో జిల్లా అధికారులను, ప్రజాప్రతినిధులకు మంత్రి పువ్వాడ పలు సూచనలు చేశారు.

సీఎం కేసీఅర్ ఆదేశానుసారం ఆయా ఉత్సవాలు అట్టహాసంగా నిర్వహించాలని ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలిసేలా నిర్వహించాలన్నారు.

ఇది కూడా చదవండి:- కేసీఆర్ ను గద్దే దింపే.. దమ్మున్నోళ్లా..?: మంత్రి

ఎంపీ వద్దిరాజు రవి చంద్ర, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర రావు, అదనపు కలెక్టర్ స్నేహాలత, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్, మేయర్ పునుకొల్లు నీరజ, డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, సుడా చైర్మన్ విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.