Telugu News

అసెంబ్లీకి ముహుర్తం ‘డిసెంబర్ 6’..?

అక్టోబర్ 1న అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్..?

0

అసెంబ్లీకి ముహుర్తం ‘డిసెంబర్ 6’..?

= అక్టోబర్ 1న అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్..?

== జమిలి ఎన్నికలకు బ్రేక్..?

== చట్టపరమైన చిక్కులు వచ్చే అవకాశం

== ఐదు రాష్ట్రాలకు ఎన్నికలను నిర్వహించే యోచనలో సీఈసీ

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సీఈసీ పచ్చజెండా ఊపనుందా..? డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తుందా..? అందుకు  మహుర్తం ఖరారైయ్యే అవకాశం ఉందా..? అక్టోబర్ లో ఎన్నికల ప్రక్రియ షురూ అవుతుందా..? జమిలి మాటున ఎన్నికలు వాయిదా పడే అవకాశం లేదా..? జమిలి ఎన్నికలు జరిగే అవకాశం లేదా..? అంటే నిజమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. దేశవ్యాప్తంగా ఒకే నేషన్..ఒకే ఎలక్షన్ అంటూ కేంద్రప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిన జమిలి ఎన్నికల నిర్వాహణ చాలా కష్టంగా మారే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.. చట్టాలు..సవరణలు ఇప్పటికిప్పుడు సాధ్యసాధ్యాలు కావాని అభిప్రాయపడుతున్నారు.. అందుకే అసెంబ్లీ ఎన్నికలు ముందు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.. అసలు జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే చట్టాలు ఏం చెబుతున్నాయి..? సీఈసీ ఏం చెబుతోంది..? ఒకే నేషన్..ఒకే ఎలక్షన్ అనే జమిలి సాధ్యమేనా..? అనే పూర్తి స్థాయి వివరాలను చూడాలంటే విజయం ప్రతినిధి అందించే రాజకీయ విశ్లేషణాత్మక కథనం చదవాల్సిందే..?

ఇది కూడా చదవండి:  ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా  ‘షర్మిళ’

భారతదేశంలో 2018 సంవత్సరంలో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి.. చత్తీస్ గడ్, మీజోరం, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సమయానుకూలంగా, ముందస్తుగా వెళ్లిన తెలంగాణ రాష్ట్రానికి అసెంబ్లీ జరిగాయి. ఆ నాలుగు రాష్ట్రాలకు 2018 డిసెంబర్ 7న పోలింగ్ జరిగింది.. అయితే ఈ రాష్ట్రాలకు రాజ్యంగ చట్టం ప్రకారం ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు జనవరి 16లోపు ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.. ఈమేరకు కేంద్ర ఎన్నికల కమీషన్ ఆ దిశగా అడుగులు వేస్తోంది.. నాలుగు రాష్ట్రాలకు ఒకే సారి ఎన్నికలను నిర్వహించేందుకు కావాల్సిన చర్యలు చేపట్టింది.. కచ్చితంగా సమయానుకూలంగా ఎన్నికలను జరపాల్సి వస్తే జనవరి 16 నాటికి ఆ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలను పూర్తి చేయాల్సి ఉంటుంది.. ఆదిశగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ పార్టీలు కూడా సంసిద్దమవుతున్నారు. అందులో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల హీట్ షూరు అయ్యిందనే చెప్పాలి. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సై అంటూ సీఎం కేసీఆర్ శంఖారావం ఊదేశారు. దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా అందుకు సర్వం సిద్దమవుతున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది.. అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ ఇతర పార్టీలు ప్రయత్నాల్లో నిమగ్నమైయ్యారు. ఈనెలాఖరు నాటికి అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇక అభ్యర్థులు, అశావాహులు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో  ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ప్రజలను అకట్టుకునే ప్రచారాల్లో నిమగ్నమైయ్యారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ గూటికి తుమ్మల..?

మరో వైపు రాష్ట్ర ఎన్నికల కమీషన్ కూడా అసెంబ్లీ ఎన్నికల నిర్వాహణకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అన్ని శాఖలాధికారులను బదిలీ చేపట్టిన ఎన్నికల కమీషన్, ఓటర్ల జాబితా సవరణ, చేర్పులు, మార్పులు ప్రక్రియను ప్రారంభించింది. అలాగే ఈవీఎంలను తనిఖీ చేస్తోంది. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు పై ద్రుష్టి పెట్టింది.. పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఇలా నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, ప్రతిపక్ష పార్టీలు, ఆయా రాష్ట్రాల ఎన్నికల కమీషన్ సమయానుకూలంగా ఎన్నికలను నిర్వహించేందుకు సర్వం సిద్దమైందనే చెప్పాలి..

== అక్టోబర్ 1న షెడ్యూల్..?

అంతా అనుకున్న సమయానికి ఎన్నికలు జరిగే అవకాశం ఉంటే తెలంగాణ రాష్ట్రంతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు కచ్చితంగా అక్టోబర్ 1న షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నిబంధనల ప్రకారం షెడ్యూల్ విడుదల చేసిన సమయం నుంచి 45 రోజుల లోపు పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే డిసెంబర్ 6న పోలింగ్ నిర్వహించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. డిసెంబర్ 6న రిజల్ట్, 25 లోపు ప్రభుత్వ ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది..అయితే కేంద్రప్రభుత్వం ఏ విధంగా ముందుకు అడుగు వేస్తుందో..? కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది..