Telugu News

నలుగురు సీఎంల సాక్షిగా జర్నలిస్ట్ లను వంచన

ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ ఎప్పుడు

0

నలుగురు సీఎంల సాక్షిగా జర్నలిస్ట్ లను వంచన

== ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ ఎప్పుడు

== కేటీఆర్ ఏ మొఖం పెట్టుకొని జిల్లాకు వస్తున్నావ్

==కాంగ్రెస్ పై విష ప్రచారం చేస్తే సహించేది లేదు

== జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

నలుగురు సీఎంల సాక్షిగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో జర్నలిస్టులను ముఖ్యమంత్రి కేసిఆర్ వచించాడాని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తూ కష్ట నష్టాలను అనుభవిస్తున్న మీడియా మిత్రులకు ఇస్తానన్న ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ ద్వజమెత్తారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..జిల్లాకు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారో  చెప్పాలని డిమాండ్ చేశారు.పది ఏండ్లుగా రాష్ట్రంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని అప్పులు మాత్రం విపరీతంగా పెరిగాయని ఆరోపించారు.మోస పూరిత ప్రకటనలతో రెండు పర్యాయాలు అధికారానెక్కి ప్రజలను మోసం చేసిన కెటిఆర్ మళ్ళీ మోస పూరిత హామీలతో జిల్లాకు రావడం సిగ్గు చేటని విమర్శించారు.నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ….జిల్లాలో  ఎంత మందికి డబుల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేశారో  కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: ఓట్ల కోసం కేసీఆర్ ది దొంగ కపట నాటకం: భట్టి విక్రమార్క

నగరంలో ప్రముఖల విగ్రహాల తొలగింపు పై కెటిఆర్ సమాధానం చెప్పాలని కోరారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పథకాలకు సంబంధించిన పోస్టర్లను తొలగిస్తున్నారని, బిజెపి,బీఆర్ఎస్లు కలిసి ప్రతిపక్షాలను అణగ దొక్కే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు .అనంతరం కార్పొరేటర్లు దుద్దుకూరి వెంకటేశ్వర్లు, లాకవత్ సైదులు నాయక్, మిక్కిలినేని మంజుల మాట్లాడుతూ..ఒక్క మమత రోడ్, ఇల్లందు క్రాస్ రోడ్ కు వీధి దీపాలు, రంగు రంగు రంగుల వాల్ పెయింట్స్ తో నగరం అభివృద్ధి చెందదని నగరం లో అన్ని  డివిజన్ లు అభివృద్ధి చెందితే అదే నిజమైన అభవృద్ధి అని అన్నారు. జిల్లాకు వచ్చే కెటిఆర్ అభివృద్ధి పై చర్చ కు రావాలని డిమాండ్ చేశారు.

ఈ ప్రెస్ మీట్ లో వీరితో పాటు నగర కాంగ్రెస్ కమిటి వర్కింగ్ ప్రెసిడెంట్ నాగండ్ల దీపక్ చౌదరి, పల్లెబోయిన భారతి చంద్రం, జిల్లా మైనారిటీ,SC సెల్, కిసాన్ కాంగ్రెస్ అద్యక్షులు సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, మోక్కా శేఖర్ గౌడ్, బొడ్డు బొందయ్య, మాజి కౌన్సిలర్ పాలకుర్తి నాగేశ్వరావు లు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ఖమ్మంలో  పోస్టర్ వార్ ..