Telugu News

అభివృద్ధి నిరోధక బిజెపిని ఓడించాలి

గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పడిగ ఎర్రయ్య

0

అభివృద్ధి నిరోధక బిజెపిని ఓడించాలి

== గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పడిగ ఎర్రయ్య

ఏన్కూరు. మే 20(విజయం న్యూస్):
అభివృద్ధి నిరోధక బీజేపీని ఓడించాలని గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పడిగ ఎర్రయ్య అన్నారు.. సోమవారం లచ్చగూడెం గ్రామంలో యుసిసిఆర్ఐ(ఎంఎల్) ఉమ్మడి జిల్లా పార్టీ ఎన్నికల సమీక్ష సమావేశo కల్తీ రామచంద్రయ్య అధ్యక్షత జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎర్రయ్య పాల్గొని మాట్లాడారు. విప్లవ ప్రజా ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు. భూస్వామ్య విధానం రద్దు దున్నేవానికి భూమి వ్యవసాయక విప్లవం ద్వారానే సాధించడం జరిగిందని గుర్తు చేశారు. .ఈ ప్రజా యుద్ధ పంథాలో ప్రజలందరూ పాల్గొని భారత విప్లవం కోసం కృషి చేయాలని కోరారు..ఎన్నో సాహిత్యాలు,సైద్ధాంతిక పరమైన విషయాలు అందించిన గొప్ప సిద్ధాంతకర్త దేవులపల్లి వెంకటేశ్వరావు సూచించిన మార్గంలో ప్రయాణించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు పోలే బోయిన ముత్తయ్య, షేక్ సౌంద్ మియా,, జక్కం శ్రీను, డీఎస్ఓ రాష్ట్ర కార్యదర్శి కల్తీ లేనిన్ తదితరులు పాల్గొన్నారు