Telugu News

నామకు మద్దతు తెలిపిన ఆప్ పార్టీ

దేశ క్షేమం కోసం బిజెపి ని ఓడించండి:నామా

0

దేశ క్షేమం కోసం బిజెపి ని ఓడించండి:నామా

== నామకు మద్దతు తెలిపిన ఆప్ పార్టీ

== ఖమ్మంఆప్ పార్లమెంటు కార్యకర్తల సమావేశంలో నల్లమోతు తిరుమల రావు

(ఖమ్మం-విజయం న్యూస్):

దేశ సంస్కృతి, ఔన్నత్యం,గౌరవం కాపాడడం కోసం బిజెపి పార్టీని నీళ్ళు ఓడించాలని ఆమ్ఆద్మీపార్టీ తెలంగాణా కోర్కమిటీ సభ్యులు నల్లమోతు తిరుమల రావు పిలుపు నిచ్చారు.శనివారం ఖమ్మం లోని ఆప్ జిల్లా కార్యాలయం లో ఆప్ జిల్లా అద్యక్షులు స్వర్ణ సుబ్బారావు అద్యకతన జరిగిన ఖమ్మం పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ ఇన్చార్జిలు,వాలెంటీర్ల సమావేశం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.బిజేపి మళ్ళీ అదికారం లోనికి వస్తే వివిధ వర్గాల మద్య చిచ్చు పెట్టి దేశాన్ని వల్లకాడుగా మారుస్తుందని హెచ్చరించారు.గత పదేళ్ళు గా బిజెపి దేశాన్ని తెగనమ్మడం తప్ప మరో మంచి పనిచేసింది ఏమీలేదని విమర్శించారు.

ఇది కూడా చదవండి:-ఎన్టీఆర్  స్పూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చా:నామా

అబివృద్ది చేయక పొగా ఆచరణలో అబివృద్ధి చేసి చూపిన కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ లాంటి ముఖ్యమంత్రు లను తప్పుడు కేసులు పెట్టి జైళ్ళలో నిర్బంధించి అప్రజాస్వామికంగా ఎన్నికల ను జరుపుతున్నారని దుయ్యబట్టారు.కార్పోరేట్ బాండ్లు ద్వారా కన్నం లో దొంగ లా వేల కోట్ల అవినీతి తో దొరికినా ఎలాంటి చర్యలు లేవని దుయ్యబట్టారు.మోడీ మళ్ళీ గెలిస్తే ప్రజాస్వామ్యం,ఎన్నికలు, రిజర్వేషన్ లు, రాజ్యాంగం ఉండదని అన్నారు.బిజేపిని ఓడించే బలమైన అభ్యర్థికి ఓటువేసి గెలిపించాలని కోరారు.ఈ ఖమ్మం పార్లమెంటు స్థాయి సమావేశంలో పాలేరు అసెంబ్లీ ఇన్చార్జి పసుమర్తి శ్రీనివాస్,మదిర అసెంబ్లీ ఇన్చార్జి గంధం పుల్లయ్య, అశ్వారావుపేట అసెంబ్లీ ఇన్చార్జి చరపా పాపారావు దొర,సత్తుపల్లి అసెంబ్లీ ఇన్చార్జి సిద్దెల రాంబాబు,వైరా అసెంబ్లీ ఇన్చార్జి గుత్తా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆప్ కార్యాలయం కు నామా! ఖమ్మం: ఆమ్ఆద్మీపార్టీ కార్యాలయం కు ఓటు అడగడానికి ప్రస్థుత పార్లమెంటు సభ్యులు , బిఆర్యస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు శనివారం తమ సహాచరులతో కలిసి వచ్చారు.తమ కార్యాలయం కు వచ్చిన పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు ను ఆమ్ఆద్మీపార్టీ నాయకులు కార్యకర్తలు మర్యాదపూర్వకంగాఉచితరీతిన సన్మానం చేశారు.

ఇది కూడా చదవండి:-ఖమ్మం టీడీపీ ఆఫీస్ కు బీఆర్ఎస్ అభ్యర్థి నామ

శాలువాకప్పి, పూలమాల తో నామాను సత్కరించారు.ఈసందర్భంగా ఆమ్ఆద్మీపార్టీ తెలంగాణా కోర్కమిటీ సభ్యులు నల్లమోతు తిరుమల రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో అప్పటిపార్లమెంటు సభ్యులు గా నామా నాగేశ్వరరావు పాత్రను ప్రశంసించారు.తమ పార్టీ ఇచ్చిన గైడ్ లైన్ ప్రకారం నిర్ణయం తీసుకుంటామని అన్నారు.ఈసందర్భంగా పార్లమెంటు సభ్యుడు, ప్రస్తుతం పార్లమెంటు బిఆర్యస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ పదేళ్ళు నాడు కేజ్రీవాల్ అవినీతి వ్యతిరేక ఉద్యమం సందర్భంగా తమతో ఉన్న అనుబంధం గుర్తుచేసుకున్నారు.సామాన్యులలో సామాన్యుడిగా ఉన్న డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై అక్రమం గా కేసుపెట్టి జైళ్ళలో పెట్టడం అన్యాయం అన్నారు.విలువలుకు కట్టుబడి ఉండే అభ్యర్థిగా ఆమ్ఆద్మీపార్టీ సభ్యులు తమకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.తానుగెలిస్తే స్థానికంగా ఉండి ప్రజాసమస్యలు పార్టీలకు అతీతంగా పనిచేస్తామని అన్నారు.ఈకార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు కొండబాల కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.