Telugu News

మతోన్మాద బిజెపిని ఓడించండి: నున్న నాగేశ్వరరావు 

సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు..

0

మతోన్మాద బిజెపిని ఓడించండి: నున్న నాగేశ్వరరావు 
== ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించండి…
== సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు..

 (కూసుమంచి-విజయం న్యూస్)
ఓకే కుటుంబంలా కలిసి ఉండే, దేశ ప్రజలను కులాల, మతాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టేలా , ఎప్పుడు ప్రజల మధ్య స్విచ్ పెట్టే మతోన్మాద
బిజెపి పార్టీని ప్రజలు ఓడించాలని, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ (ఇండియా కూటమి) అభ్యర్థి రామా సహాయం రఘురాం రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలోని పద్మా రెడ్డి భవనంలో జరిగిన సిపిఎం మండల స్థాయి జనరల్ బాడీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… మోడీ గత 10 సంవత్సరాలలో ప్రజలకు చేసింది ఏమీ లేదని, ఎన్నికలు వచ్చిన ప్రతిసారి అనేక వాగ్దానాలు చేశారని, అవి నేటి వరకు అమలు చేయలేదని, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ, ప్రవేట్ పరం చేస్తూ… దేశాన్ని కార్పోరేట్ శక్తుల చేతుల్లో పెడుతున్నారని విమర్శించారు. దేశంలో రోజురోజుకీ పేదరికం పెరుగుతుండగా, దేశ సంపద మొత్తం 10 మంది చేతుల్లోకే వెళుతుందని, పేదవాడిని మరింత పేదరికంలోకి నెట్టి వేయడం జరుగుతుందని,ధనవంతులు మరింత ధనవంతులుగా అవుతున్నారని, ఈ అన్నింటికి కారణం మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఆర్ధిక విధానాలే కారణమని తెలిపారు.

ఇది కూడా చదవండి:- ఖమ్మంలో ఎటు చూసినా ప్రభం *జనం*

మరోసారి దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాత్రం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని, రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రజలు మతోన్మాద బిజెపి ఓడించి ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మల్లెల సన్మతరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం మండల ఇంచార్జ్ బుగ్గవీటి సరళ, మండల కార్యదర్శి యడవల్లి రమణారెడ్డి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు శీలం గురుమూర్తి, తోటకూరి రాజు, మాజీ జెడ్పిటిసి ఎర్రబోయిన భారతి, మండల కమిటీ సభ్యులు, పలు గ్రామశాఖ కార్యదర్శులు, మండలంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

ఇది కూడా చదవండి:- మూడో నెంబర్ “గుర్తుం”దా…!: విక్టరీ వెంకటేష్