Telugu News

దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ:జావిద్

అప్రజాస్వామ్య పాలనకు చరమగీతం పాడాలి

0

*దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ:జావిద్
*👉🏻అప్రజాస్వామ్య పాలనకు చరమగీతం పాడాలి*
*👉🏻మోడీ కి రాహుల్ భయం పట్టుకుంది*
*👉🏻నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్*

(రఘునాథపాలెం-విజయం న్యూస్)

దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడుతుందని నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఏఐసీసీ, టిపిసిసి ఆదేశాల మేరకు శనివారం మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో రఘునాధపాలెం గ్రామంలోని ఎస్సీ సెల్ అధ్యక్షులు రెంటాల ప్రసాద్ నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

Allso read:- పోరాట పటిమ ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి: జావిద్

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యా న్ని కూని చేసే విధంగా అన్ని రకాల దర్యాప్తు సంస్థలను జ్యుడీషియల్ వ్యవస్థను కూడా ఇన్ బ్లెమ్ చేసేందుకు దిగజారిందని విమర్శించారు. ఈ విషయం పై సామాన్య ప్రజలందరూ ఆలోచన చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. రాహుల్ గాంధీ పై వేసిన అనర్హత వేటు చాలా అక్రమం, అన్యాయమని, ఈ విషయాన్ని ప్రపంచంలో ఉన్న ప్రజా సంఘాలు, మేధావులు అందరూ వ్యతిరేకిస్తున్నాయని అన్నారు రాహుల్ గాంధీ మాట్లాడింది కర్ణాటకలోని కోలార్ లో అయితే కేసు దాఖలైంది గుజరాత్ లోని సూరత్ చీఫ్ జ్యుడిషియల్ జరిగిన ఈ మేజిస్ట్రేట్ కోర్టులో అని తెలిపారు. కర్ణాటకలో వ్యవహారం పై గుజరాత్ లోని సూరత్ పరిధిలోకి రాని వ్యవహారమన్నారు. పార్లమెంట్ లో ఆదాని అవినీతిని పదేపదే ప్రశ్నించినందుకే రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేశారని, మోదీ నియంతృత్వ నిరంకుశ చర్యలకు భయపడేది లేదని ఆదానీ ఆర్థిక అవకతవకలపై జేపీసీ వేసి తీరాలన్నారు ఇట్టి విషయాన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ

ఖండిస్తున్నారని ఆయన తెలిపారు.

Allso read:- అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు:పువ్వాళ్ళ
ప్రపంచ కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద అదానీ స్కాంపై విచారణకు మోడీ ఎందుకు భయపడుతున్నారని, దేశ చరిత్రలోనే అప్రజాస్వామిక పాలన కొనసాగుతున్నదని అన్నారు. గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సొంత పార్టీ నేతలపై విచారణ చేయించి మంత్రులను సైతం జైలుకు పంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. రాహుల్ గాంధీకి రెండేండ్ల జైలు శిక్ష విధించడం, మరునాడే లోక్సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేయడం పథకం ప్రకారమే జరిగిందన్నారు. 2019 కర్ణాటక ఎన్నికల్లో రాహుల్ గాంధీ దొంగలకు మోదీ అని పేరు ఎలా వచ్చిందని నీరవ్ మోదీ, లలిత్ మోదీ పేర్లను ప్రసంగించారు తప్ప, మోదీలందరూ దొంగలే అని తన ప్రసంగంలో ఎక్కడా అనలేదన్నారు.

Allso raed:- పొంగులేటి ఖబర్దార్!

.దేశ చరిత్రలో ఇప్పటివరకు పరువునష్టం కేసులో ఎవరికి శిక్ష పడలేదన్నారు. పార్లమెంట్లో అదానీ అవినీతిని ప్రశ్నించినందుకే రాహు ల్ గాంధీపై అనర్హత వేటు వేశారన్నారు. మోదీ చర్యలకు భయపడేది లేదని, ఆర్థిక అవకతవకలపై జేపీసీ విచారణ చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 2 వ డివిజన్ కార్పొరేటర్ మలిదు వెంకటేశ్వర్లు, ఎంపిటిసి తేజావత్ వెంకన్న,రఘునాథ పాలెం మండల బాధ్యులు భూక్యా బాలాజీ, బిహెచ్ రబ్బానీ, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు రెంటాల ప్రసాద్,

Allso raed:- రాహుల్ అభినవ భగత్ సింగ్ – మాజీమంత్రి సంభాని

జిల్లా కాంగ్రెస్ నాయకులు మారం కరుణాకర్ రెడ్డి, కొంటేముక్కుల నాగేశ్వరరావు, ఖమ్మం నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఏలురి రవికుమార్, ఖమ్మం నియోజకవర్గ ఎస్సీ సెల్ కన్వీనర్ కూరపాటి మధు,మండల ముఖ్య నాయకులు బోడ తావుర్య నాయక్, నూనవాత్ హరిసింగ్,మాధం శెట్టి హనుమంతరావు, ఇర్జాల కృష్ణ, భూక్యా వెంకన్న, ఆలస్యం సూరయ్య, బానోత్ మోహన్, బోడ లక్పతి,తేజావాత్ నవీన్, కృష్ణ ప్రసాద్, భూక్యా బిక్షం, అంతోటి శివ,నర్సింహ రావు, తది తరులు పాల్గొన్నారు.