Telugu News

డెస్క్ జర్నలిస్టులు.. వర్కింగ్ జర్నలిస్టులే

అల్లం నారాయణకు వినతి చేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా డెస్క్ జర్నలిస్టులు

0

డెస్క్ జర్నలిస్టులు.. వర్కింగ్ జర్నలిస్టులే

==  ప్రెస్ అకాడెమీ ఛైర్మెన్ అల్లం నారాయణ

== అల్లం నారాయణకు వినతి చేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా డెస్క్ జర్నలిస్టులు

ఖమ్మం ప్రతినిధి, ఫిబ్రవరి 11(విజయంన్యూస్):

డెస్క్ జర్నలిస్టులు..వర్కింగ్ జర్నలిస్టులేనని, జర్నలిస్టులకు కేటాయించే ఇండ్ల స్థలాల ప్రక్రియలో అర్హులైన డెస్క్ జర్నలిస్టులకు అందుతాయని రాష్ట్ర ప్రెస్ అకాడెమీ ఛైర్మెన్ అల్లం నారాయణ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జర్నలిస్టులకు నిర్వహించే శిక్షణ తరగతులలో పాల్గొనేందుకు వెళ్తున్న నేపథ్యంలో శనివారం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హోటల్ లో టీయూడబ్ల్యూజె (టీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవి, ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు వెన్నబోయిన సాంబశివరావు,  టెంజూ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు బొల్లం శ్రీనివాస్, ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో డెస్క్ జర్నలిస్టులు ప్రెస్ అకాడెమీ ఛైర్మెన్ అల్లం నారాయణ, టీయూడబ్ల్యూజె (టీజేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ లను మర్యాదపూర్వకంగా కలిశారు. డెస్క్ జర్నలిస్టుల అధ్యక్ష, కార్యదర్శులు ప్రతాపురం శ్రీనివాస్, బొమ్మగాని వంశీ(పిచ్చయ్య)ల ఆధ్వర్యంలో డెస్క్ జర్నలిస్టులు ప్రెస్ అకాడెమీ ఛైర్మెన్ అల్లం నారాయణను కలిసి మెమోరాండం ను అందజేశారు.

ఇది కూడా చదవండి: అసెంబ్లీలో భట్టి ప్రశ్నల వర్షం

అనంతరం టీజేఎఫ్ నూతన డెస్క్ జర్నలిస్టుల కమిటీని అల్లం నారాయణ అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రెస్ అకాడెమీ ఛైర్మెన్ అల్లం నారాయణ మాట్లాడుతూ… జనవరి 18న ఖమ్మంలో జరిగిన బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పక్షం రోజుల్లోనే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపు కు శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. ఇండ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంను రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, తన్నీరు హరీష్ రావులు వేగవంతం చేసి జర్నలిస్టుల కుటుంబాలలో ఆనందాన్ని నింపారని తెలిపారు. రాష్ట్రంలో పని చేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికి ఇండ్లస్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డెస్క్ జర్నలిస్టుల యూనియన్ ఉపాధ్యక్షులు రతన్, అచ్చిరెడ్డి, కోశాధికారి అంజి, టీజేఎఫ్ నాయకులు రాజేంద్రప్రసాద్, యలమందల జగదీష్, ముత్యాల కోటేశ్వరరావు, పి.తిరుపతిరావు బిక్కి గోపి తదితరులు పాల్గొన్నారు.