మహేశ్వరంలో భట్టి పాదయాత్రకు అడుగడుగున నిరాజనం
== 54వ రోజు మహేశ్వరంలో కొనసాగిన పాదయాత్ర
== సంఘీభావం తెలిపి పాదయాత్ర చేసిన గద్దర్
(మహేశ్వరం/ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పిపుల్స్ మార్చ్ పాదయాత్ర 54వ రోజు విజయవంతంగా కొనసాగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలో జిల్లెలగూడ నుంచి ప్రారంభమైంది. మహేశ్వరం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు భట్టి పాదయాత్రకు భారీగా తరలివచ్చారు. ముఖ్యమైన నాయకులు భట్టికి స్వాగతం పలికారు. గ్రామాల్లో అడగడుగున నిరాజనాలను అందించారు. మహిళలు హరతులిచ్చి, తిలకం దిద్ది ఆశీర్వదించారు. బట్టి విక్రమార్క పాదయాత్రకు మద్దతు ఇవ్వడానికి విచ్చేసిన ప్రజాయుద్ధనౌక గద్దర్ హాజరైయ్యారు. జిల్లెలగూడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జిల్లెల్లగూడ, మీర్పేట్ , అల్మాస్గూడ, బడంగ్పేట్ మీదుగా మల్లాపూర్ హెచ్ పి పెట్రోల్ బంక్ వరకు కొనసాగనున్న బట్టి పాదయాత్రలో అడుగులో అడుగేస్తూ పాదయాత్రలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి హాజరైయ్యారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భారీగా పాల్గొన్న మహిళలు
ఇది కూడా చదవండి: ఆడబిడ్డకు చీరేను బహుకరించిన భట్టి
జిల్లెలగూడ స్వాగత్ గ్రాండ్ దగ్గర యువకులు భారీ ఎత్తున తరలివచ్చి సీఎల్పీ నేత బట్టి విక్రమార్క కి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి కి గజమాలతో సత్కరించి జై బట్టి, జై చల్ల నరసింహారెడ్డి అంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం లో అమరేందర్ రెడ్డి, దేప భాస్కర్ రెడ్డి, చిగురింత నర్సింహా రెడ్డి, మీర్ పేట్ కార్పొరేటర్లు శ్రీమతి చల్లా కవిత బాల్ రెడ్డి,శ్రీమతి సిద్ధాలా మౌనిక శ్రీశైలం, జిల్లా ఉపాధ్యక్షులు దేవగోని కృష్ణ జిల్లా జనరల్ సెక్రటరీ ఎరుకల వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ నిమ్మల వెంకటేష్ గౌడ్, కంటెస్టెంట్ కార్పొరేటర్ జి. రవీందర్ రెడ్డి, మాజీ వార్డు మెంబెర్ కీసరి యాదిరెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు ఆలా శ్రీనివాస్ రెడ్డి, బండి మధుసూదన్, అమీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు సామిడి గోపాల్ రెడ్డి,ఆర్ కే పురం డిజైన్ ప్రెసిడెంట్ పున్న గణేష్, దీక్షిత్ మీర్పేట్ మున్సిపల్ మాజీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు గంగమ్మ, ఎరుకల మురళి గౌడ్, పైళ్ల శేఖర్ రెడ్డి, పరుశురాం, తదితరులు పాల్గొనడం జరిగింది.
ఇది కూడా చదవండి: సత్తుపల్లి లో దారుణం..ముగ్గురు మృతి