పొలాలకు డొంక రోడ్లు వేసా: మంత్రి పువ్వాడ
== ఇంటింటికీ త్రాగునీరు అందించా
== ప్రతి గ్రామంలో ప్రజలకు కావాల్సిన పనులు చేసి చూపించా
== అభివృద్ది ఎవరు చేశారో చూసి ఓట్లేయ్యండి
== చింతగుర్తి నుంచి సూర్యతండాకు రోడ్డు బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం చింతగుర్తి గ్రామం నుండి సూర్య తండా వెళ్లే రహదారిపై రూ.2.95 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి నిర్మాణ పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. అనంతరం నూతనంగా నిర్మించనున్న పల్లె దవాఖాన ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒక్క చింత గుర్తి గ్రామంకే రూ.3.50 కోట్ల రూపాయలు మంజూరు చేసి పలు అభివృద్ది పనులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రతి గ్రామం లో వెలుగులు ఉండాలనే ఆకాంక్ష తో మండలం మొత్తం 40 హై మాస్ట్ లైట్స్ ను ఎర్పాటు చేశామన్నారు. గ్రామంలో రూ.25 లక్షలతో హెల్త్ సెంటర్ ను మంజూరు చేయడం జరిగిందని, నేడు ప్రారంభించినంక ఇక వైద్య కోసం ఎవ్వరు ఖమ్మం వరకు వెళ్లాల్సిన పని లేదన్నారు. ఖమ్మం కు మళ్ళీ పాత ఇనుప సరుకు వస్తుందని, దాని ఎలా ఇంటికి పంపాలో మనకు తెలుసునని దాన్ని ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: ఖమ్మం ఏసీపీ పరిధిలోకి రఘునాథపాలం పోలీస్ స్టేషన్
.పొలాలకు డొంక రోడ్లు వేసా, మండలం కు అనుసంధానం చేస్తూ బ్లాక్ టాప్ రోడ్లు వేశా, గ్రామంలో అనేక వేడుకల్లో సీసీ రోడ్లు వేశా.. ఇంటింటికీ త్రాగునీరు అందించానని అన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలకు కావాల్సిన ప్రతి ఒక్క పని చేసి చూపించినం. ఇంకా చాలా చేస్తామన్నారు. త్వరలో ఎన్నికలు రానున్నాయని ఎవరెన్ని ప్రలోభాలు పెట్టిన లొంగకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మండలంలోని గ్రామాలలోని వివిధ పార్టీల నాయకులు ఒక్క సారి అభివృద్ది చూడండి.. అభివృద్ది ఎవరు చేశారో చూసి మీ జెండాలు కొన్ని రోజులు పక్కన పెట్టండి.. రాజకీయాలకు అతీతంగా మీ కోసం పని చేసిన నన్ను గెలిపించండి అని కోరారు. ఇప్పుడు మన గ్రామంలో జరిగిన అభివృద్ది కేవలం శాంపిల్ మాత్రమే.. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక ఇంతకు నాలుగింతల అభివృద్ధిని మీకు చేసి చూపిస్తా అని చెప్పారు.
ఇది మన ప్రభుత్వం.. వచ్చేది కూడా మన ప్రభుత్వమే.. ఇందులో ఎలాంటి సందేహం లేదు.. కావాల్సింది మెజారిటీ అని స్పష్టం చేశారు. సర్పంచ్ మెంటేం రామారావు అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఏఎంసీ చైర్మన్ దోరేపల్లి శ్వేత, జెడ్పీటీసీ ప్రియాంక, ఎంపిపి గౌరీ, వైస్ ఎంపిపి గుత్తా రవి, మద్దినేని వెంకట రమణ, సర్పంచ్ లు మాదంశె ట్టిహరి ప్రసాద్, ప్రదీప్, వీరు నాయక్, మందడపు సుధాకర్, కుర్రా భాస్కర్ రావు తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: నేడు ఖమ్మంకు ‘తారకరామారావు’