Telugu News

ఖమ్మంలో నలు దిక్కుల అభివృద్ది చేసి:మంత్రి పువ్వాడ

గల్లీగల్లీకి.. వీధి..వీధికి రోడ్లేసిన

0

ఖమ్మంలో నలు దిక్కుల అభివృద్ది చేసి:మంత్రి పువ్వాడ

== గల్లీగల్లీకి.. వీధి..వీధికి రోడ్లేసిన

== అభివృద్ది ఇదిరా అన్నట్లుగా ఖమ్మంను మార్చినమ్

== 60ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించిన మంత్రి పువ్వాడ అజయ్

== అసెంబ్లీలో ఖమ్మం పోటోలు చూపిస్తుంటే సంతోషమేసింది

== సీఎం కేసీఆర్ వల్లనే ఇది సాధ్యమైంది

== మళ్లోసారి అవకాశం ఇస్తే..మరింత అభివృద్ది చేసి చూపిస్తా

== అత్మీయ సమ్మెళనం కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఖమ్మం నగరంలోని నలు దిక్కులు అభివృద్ది చేసి చూపించానని, మరోసారి ప్రజల ఆశీర్వాదంతో మరింత అభివృద్ది చేసి చూపిస్తానని రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని ప్రతి గల్లీలో ప్రజలకు కావాల్సిన అన్ని మౌళిక వసతులు, వసతులు, సౌకర్యాలు కల్పించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వదే అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం రఘునాథపాలెం రోడ్ లో గల ప్రగతి ప్రైడ్ నందు చావా రాము అధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో వారు మాట్లాడారు. నేడు ఖమ్మం అనేక మున్సిపాలిటీ లకు ఆదర్శంగా నిలిచింది. మన ఖమ్మంలో జరిగి అభివృద్దిని చూసి ఇతర మున్సిపాలిటీ లు అనుకరిస్తూన్నాయని తెలిపారు. మన ఖమ్మం లో జరిగిన పనులను అసెంబ్లీ లో మంత్రి కేటిఆర్ పోటోలను చూపిస్తూ మెచ్చుకుంటున్నారని అన్నారు.

allso read- 14ఏళ్ల సీఎం..14 రోజుల జైలుకు చంద్రబాబు

ఖమ్మం నగరం ఏ పరిస్థితి నుండి నేడు ఏ స్థాయికి చేరుకుంది అనేది మన కళ్ళ ముందే ఉందని, ప్రజలందరు గమనించి రాబోయే ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు. బీఆర్ఎస్  ప్రభుత్వంలో వచ్చినన్ని నిధులు ఖమ్మం జిల్లా చరిత్రలో ఎప్పుడూ రాలేదు.. ముఖ్యమంత్రి కేసీఅర్, మంత్రి కేటిఆర్ సహకారం వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఇదే అభివృద్ది కొనసాగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ను మళ్ళీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. హ్యాట్రిక్ కొట్టాలి.. అభివృద్ధిని కొనసాగించాలన్నారు. ఖమ్మం నగర ప్రజల సమస్యలు నా సమస్యలుగా భావించ. కాబట్టే నేడు గొంగళి పురుగులా ఉన్న ఖమ్మం ను సీతాకొకచిలుకలా మార్చిన ఘనత నాదేనని అన్నారు. ప్రజలకు కావాల్సిన ప్రధమ వసతి త్రాగునీరు.. అది నేడు ప్రతి ఇంటికి అందించామని, ఒక్క ఇంటిని కూడా వదలకుండా ప్రతి ఇంటికి త్రాగునీరు నల్లలు ఏర్పాటు చేసి అందిస్తున్నామని తెలిపారు. నగరం నలు దిక్కుల అభివృద్ది జరిగిందని, అది కేవలం ఖమ్మంకు మంత్రి పదవి రావడం వల్లే సాధ్యమైందన్నారు. మళ్లీ అవకాశం వస్తే, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమని, మరోసారి మనకు మంత్రిగా అవకాశం రావోచ్చని అన్నారు. 75 ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా ఖమ్మం కు మంత్రి పదవి ఇవ్వాళే.. అది కేసీఅర్ వల్లే అయిందని, వారికి ధన్యవాదాలు తెలిపారు. ఖమ్మంను ఉన్నత స్థాయిలో చూడాలని ఉంది. ఇప్పటికే ఆశించిన దాని కంటే ఎక్కువే అభివృద్ది చేసుకున్నాం.. కానీ నా ఆలోచనలో చేయాల్సినవి మరెన్నో ఆవిష్కరణలు ఉన్నాయి. వాటన్నిటిని సాధిస్తామన్నారు.

alls read- వేషగాళ్లు వస్తున్నారు..? జరజాగ్రత్త: మంత్రి

అది నా బాధ్యత, కర్తవ్యం.. ఖమ్మం నగరం నా ఇల్లు.. ప్రజలు నా కుటుంబమన్నారు. ఈ కార్యక్రమంలో విత్తనాభివృద్ది సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వర రావు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ విజయ్ కుమార్, మండేపుడి జగదీష్, మద్దినేని వెంకటరమణ, గరికపాటి వేంకటేశ్వర రావు(జీవీఆర్), కాటా సత్యనారాయణ బాబ్జీ, వల్లభనేని రమారావు, నెల్లూరి చంద్రయ్య, డాక్టర్.కన్నేకంటి శివరామ కృష్ణ, డాక్టర్ నాగేశ్వర రావు, చుంచు గోపి తదితరులు ఉన్నారు.

== ఆర్ఆర్ హోటల్ ను ప్రారంభించిన మంత్రి

ముస్తఫా నగర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఆర్ హోటల్ ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.  బైపాస్ రోడ్ నందు  నూతనంగా ఏర్పాటు చేసిన దోచా, కోడి కూర హోటల్ ను ప్రారంభించారు. ఖమ్మం నగరం బొనకల్ రోడ్, కొత్తూరు లో నూతనంగా నిర్మించిన ఎంఎంఆర్  కన్వెన్షన్ హాల్ ను మంత్రి పువ్వాడ ప్రారంభించారు.అనంతరం కార్పొరేటర్ మందడపు మనోహర్ మనవడు జగదీష్ కృష్ణ పంచకట్టు వేడుకకు హాజరై ఆశీర్వదించారు.ఖమ్మం జూబ్లీ క్లబ్ నందు ఆధునీకరించి షటిల్ బ్యాడ్మెంటన్ ఆడిటోరియంను మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ముదిగొండ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సత్య సాయి రైస్ మిల్లు ను మంత్రి పువ్వాడ ప్రారంభించారు.

alls0 read-రుణమాఫీని ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి: మంత్రి