Telugu News

ఖమ్మం నగర అభివృద్ధి దేశానికే ఆదర్శం: మంత్రి పువ్వాడ

అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా

0

ఖమ్మం నగర అభివృద్ధి దేశానికే ఆదర్శం: మంత్రి పువ్వాడ

== అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా

== ఖమ్మం లో రూ.2.28 కోట్లతో సెంట్రల్ డివైడర్, లైటింగ్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఖమ్మం నగరంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి యావత్‌ రాష్ర్టానికే ఆదర్శమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం కార్పోరేషన్ పరిధిలోని 58వ డివిజన్ రాపర్తి నగర్ సెంటర్ నుండి టీఎన్జీవోస్ కాలని వరకు రూ. 2.28 కోట్లతో నిర్మించిన సెంట్రల్ డివైడర్, సెంట్రల్ లైటింగ్ ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గడిచిన ఎనిమిదేళ్లలో రాష్ట్రప్రభుత్వం ఖమ్మం అభివృద్ధికి కోట్లాది రూపాయలు విడుదల చేసిందన్నారు.  75 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం ఏడేళ్లలోనే సాధ్యమైందన్నారు.

ఇది కూడా చదవండి: సత్తుపల్లి పై షర్మిల బాణం.

సొంత ఇంటిని శుభ్రం చేసుకున్న మాదిరిగా ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ నేడు ఖమ్మం రాష్ట్రానికే ఆదర్శంగా నిలువటం గర్వంగా ఉందన్నారు.తాను ఖమ్మం అభివృద్ధిలో భాగస్వాములు అయి తన వంటి కర్తవ్యంగా ఖమ్మంను టైర్ సిటీస్ వరుసలో నిలుపలని దృఢంగా సంకల్పించుకున్నానని అది నేడు ఆచరణలో చేసి చూపించగలిగామని పేర్కొన్నారు.  ముఖ్యమంత్రి కేసీఅర్ గారు నేతృత్వంలో, పురపాలక మంత్రి కేటిఆర్ గారి సహకారంతో నేడు ఖమ్మం జిల్లా రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లుకు ఆదర్శంగా నిలువడం మనకు గర్వకారమనారు. ఖమ్మం నగరం చిన్న చిన్న రోడ్లతో ట్రాఫిక్‌ సమస్యలతో ఉండేది.. ఇపుడు ఎక్కడ అయిన ఏ రోడ్లు చూసినా విశాలంగా ఉన్నాయి. రోడ్లు విస్తరించామ ని ఖమ్మంలో సరైన స్మశాన వాటిక ఒక్కటి కూడా ఉండేది కాదని, కానీ ఇప్పుడు బల్లెపల్లి, కాల్వఒడ్డు వైకుంఠధామంల ముందు సెల్ఫీలు తీసుకుంటున్నారని గుర్తు చేశారు. ఖమ్మం ప్రజలకు, చిన్న పిల్లలకు ఆహ్లాదం కోసం ప్రతి డివిజన్లలో పార్కులు,అందులో ఓపెన్‌ జిమ్‌లు, పబ్లిక్‌ టాయిలెట్స్‌, తాగునీరు ఇలా అనేకం వసతులు అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు.

ఇదికూడ చదవండి: ‘ఖమ్మం గుమ్మం’ గులాబీ మయం

నగరంలో అన్ని ప్రాంతాల్లో పార్కులు, ఓపెన్ జిమ్ లు, పబ్లిక్ టాయిలెట్స్, వెజ్ అండ్ నాన్-వెజ్ మార్కెట్ లు, అన్ని ప్రాంతాలలో రైతు బజార్ లు, వాక్ వే లు, సెంట్రల్ లైటింగ్ లు, వైకుంఠదామాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, ఫుట్ పాత్ లు, మిషన్ భగీరథ ద్వారా త్రాగు నీరుకొసం ఓవర్ హెడ్ టాంక్ లు, అన్ని జంక్షన్ లలో కూడళ్లు, ఇలా అనేక అభివృద్ధి పనులు చేసుకుని ప్రజలకు మెరుగైన వసతులు సౌకర్యాలు అందిస్తున్నామని అన్నారు.

కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్ దొరేపల్లి శ్వేత, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రంజిత్, మునిసిపల్ డి.ఈ..రంగారావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు