Telugu News

సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ అభివృద్ధి:

మన ఊరు -మన ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్నఎమ్మెల్యే శంకర్ నాయక్

0

సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ అభివృద్ధి:

మన ఊరు -మన ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్నఎమ్మెల్యే శంకర్ నాయక్

(మహబూబాబాద్ విజయం న్యూస్)

తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉన్నారంటే ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తోనే తెలంగాణ అభివృద్ధి పథంలో నడుస్తుందని మహబూబాబాద్ శాసనసభ్యులు బి శంకర్ నాయక్ అన్నారు. మన ఊరు-మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని నెల్లికుదుర్ మండలంలోని నైనాల గ్రామం, రతీరాం తండా గ్రామ పంచాయితీ లలో శుక్రవారం ఎమ్మెల్యే శంకర్ నాయక్ పర్యటించారు.

మన ఊరు-మన ఎమ్మెల్యే కార్యక్రమంలో ప్రజలతో మాట్లాడి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అడిగిన సమస్యలకు అధికారులతో కలిసి ఎన్ని రోజులు సమయం పడుతుంది ఎప్పుడు పరిష్కరిస్థారో చెప్పారు.చిన్న చిన్న సమస్యలు ఉంటే వెంటనే పరిష్కారం చేశారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అనేక పెద్ద సమస్యలను గ్రామాల్లో తొలగించిందని గ్రమల్లో మార్పు మిరే గమనించండి ఒకప్పుడు మీ గ్రామం ఎలా ఉంది నేడు ఎలా ఉందో మిరే గ్రహించాలని అన్నారు. కాలేశ్వరం జలాశయాల తో చెరువులన్నీ నిండి పంటలు పుష్కలంగా పడ్డాయని పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్ బాలాజీ నాయక్, ఎంపిపి మాధవి, వైస్ ఎంపిపి వెంకటేష్, పరిపాటి వెంకట్ రెడ్డి, కసర బోయిన విజయ్, వెంకటేశ్వర రెడ్డి, అనిల్, భిక్షపతి, సర్పంచులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు.

also read :- కాంగ్రెస్ గూటికి జిట్టా బాలకృష్ణ రెడ్డి…?