Telugu News

బడుగు బలహీన వర్గాల అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యం: మల్లిబాబు

సమావేశంలో మేకల మల్లి బాబు యాదవ్

0

బడుగు బలహీన వర్గాల అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యం: మల్లిబాబు

== సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం

== సమావేశంలో మేకల మల్లి బాబు యాదవ్

ఎన్కూరు మే 4(విజయం న్యూస్):

ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అభివృద్ధి సంక్షేమం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుందని, ప్రచారంలో ఇచ్చిన హామీలను,పథకాలను అమలు చేసే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందని ,మాటతప్పని కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు అఖిలభారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లి బాబు యాదవ్ పిలుపునిచ్చారు.కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి కి మద్దతుగా ఎన్నికల ప్రచార నిర్వహణలో భాగంగా ఏన్కూర్ లో జరిగిన కురుమ యాదవ ముఖ్యుల సమావేశంలో మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ,బీసీ ,మైనారిటీలు అభివృద్ధితో సంతోషంగా ఉన్నారంటే, భూములకు రేట్లు పెరిగి అభివృద్ధి జరిగిందంటే, ప్రపంచ సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం అభివృద్ధి చెందిందంటే,గత పది సంవత్సరాల క్రితం కులవృత్తులు ఎంతో గొప్పగా అభివృద్ధి జరిగాయంటే ముఖ్యంగా బీసీ వర్గాలలోని ప్రధానమైన కురుమ యాదవులకు సంక్షేమం అభివృద్ధి జరిగిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే మాత్రమే సాధ్యపడిందని తెలిపారు.కురుమ యాదవుల కులవృత్తి అయిన గొర్రెల పెంపకం ప్రోత్సహించడానికి సంఘాలుగా గుర్తించి ఫెడరేషన్ ఏర్పాటు చేసి, ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా ఎన్సీడీసీ లాంటి నిధులు మంజూరు చేసి, ఉచితంగా గొర్రెలకు బీమా చేయడం జరిగిందని,అంతేకాకుండా ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెట్టిన ప్రమాదవశాత్తు చనిపోయిన గొర్రెల కాపరికి లక్ష రూపాయల ఎక్స్గ్రేషియా పథకం ఈనాటికీ అదే అమలవుతోంది.ఎక్స్ గ్రేషియా ఆరు లక్షల రూపాయల వరకు పెంచుతామని మాట ఇచ్చిన బి ఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని,గొర్రెలు ఇస్తామని రెండు సంవత్సరాలపాటు డీడీలు కట్టించుకుని తర్వాత చేతులెత్తేసిందని,దళితులను దళిత బంధు పేరిట మోసం చేయడం జరిగిందని,బిఆర్ఎస్ పాలనలో నాయకుల అధికారుల పెత్తనమే జరిగిందని,కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రవేశపెట్టిన ఎన్సీడీసీ పథకం ద్వారా కురుమ యాదవులు సొంతంగా ఎవరి ప్రమేయం లేకుండా వారే ఇష్టమైన చోట గొర్రెలు కొనుక్కోవడం జరిగిందని తెలిపారు.నిష్పక్షపాత పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటించి రఘురాం రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మల్లిబాబు యాదవ్ తెలిపారు.ఈ కార్యక్రమం లో వరద బోయిన నరసింహారావు ,కాలసాని నరసింహారావు,పల్లెబోయిన నాగేశ్వరరావు,పుచ్చకాయల వెంకటేశ్వర్లు, అల్లాడి నరసింహారావు,రేళ్ళ శ్రీను,వరదబోయిన బాబురావు,బడేటి వెంకయ్య,బడేటి ఉప్పలయ్య,మొగిలి కోటేషు, మొగిలి ఉప్పలయ్య, మొగిలి లింగయ్య, ఇమ్మడి సతీష్, వాకధాని లాలయ్య ,గోళ్ళ నరేష్, మర్రి ఐతం రాజు, మర్రి మహేష్, రాచబంటి పురుషోత్తం ,రేళ్ళ నరసింహారావు, తిరుమలరావు, సత్తి వెంకటేశ్వర్లు,గొల్ల చిన్న స్వామి ,గోసు వీరభద్రం,వరదబోయిన రమేష్, నాగనబోయిన నరసింహారావు,చీటి ముత్తయ్య, చిర్రా కృష్ణయ్య, దొంతబోయిన నాగేశ్వరరావు, ఇమ్మడి వీరభద్రం, నరసింహారావు,తదితరులు పాల్గొన్నారు.