Telugu News

అభివృద్ధిని ప్రజల్లోకి తీసికెళ్లాలి:నామా 

బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు

0
అభివృద్ధిని ప్రజల్లోకి తీసికెళ్లాలి:నామా 
==  దశాబ్ది వేడుకలు అంబరాన్నంటాలి
== కేసీఆర్ నాయకత్వంలో అపూర్వ ప్రగతి
==  కేసీఆర్ కు అండగా నిలవాలి
== మరింత అభివృద్ధి కోసం అధికారాన్ని కేసీఆర్ చేతుల్లో ఉంచాలి
== అభివృద్ధికి చిరునామా కేసీఆర్
== బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు
 ఖమ్మం, మే 30(విజయంన్యూస్):
ఖమ్మం జిల్లాలో దశాబ్ది ఉత్సవాలు అంబరాన్ని అంటేలా పండుగ వాతావరణంలో అత్యంత  ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా నిర్వహించే ప్రతి కార్యక్రమంలో నూ ప్రజా ప్రతినిధులు, నాయకులు, అన్ని వర్గాల ప్రజల్ని భాగస్వామ్యం చేయాలన్నారు.
కేసీఆర్ 9  ఏళ్ల పాలనలో  రాష్ట్రం, జిల్లా సాధించిన సమగ్రాభివృద్ధి,వివిధ రంగాల సంపూర్ణ ప్రగతిని ప్రజలకు తెలియజేయాలన్నారు. హైదరాబాద్ కు ధీటుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన అభివృద్ధి మన కళ్ళ ముందే సాక్షాత్కరిస్తుందని నామ తెలిపారు.తాగు,సాగు నీటి రంగాల్లో అపూర్వమైన ప్రగతిని సొంతం చేసుకున్నామన్నారు.నేడు రాష్ట్రంలో కోటిన్నర ఎకరాల్లో  వరి సాగు ఒక చరిత్ర అన్నారు. దాదాపు 2 కోట్ల ఎకరాల్లో వివిధ పంటల సాగు దేశంలోనే రికార్డ్ అన్నారు. సీఎం కేసీఆర్ కృషి, పట్టుదల వల్లనే  నేడు తెలంగాణా దేశానికి అన్నం పెట్టే స్థాయికి చేరిందన్నారు. రైతు బంధు, రైతు భీమా, 24 గంటల ఉచిత కరెంట్ పధకాలు తెలంగాణాను చరిత్ర పుటల్లోకి ఎక్కించాయని, నేడు తెలంగాణాలో  ఎక్కడ చూసినా పల్లెలు పచ్చగా సస్యశ్యామలంగా వర్ధిల్లుతున్నాయని ఎంపీ నామ అన్నారు. అందుకే తెలంగాణా ప్రజలు గులాబీ పార్టీకి బ్రహ్మరథం పట్టి, నీరాజనాలు పలుకుతున్నారని తెలిపారు. తెలంగాణా మోడల్ అభివృద్ధి మాకూ కావాలని పక్క రాష్ట్రాలు కోరుకుంటున్నాయని అన్నారు. రైతు ప్రభుత్వంగా పరిఢవిల్లుతున్న తెలంగాణా పేరు దేశ, విదేశాల్లో మార్మోగుతుందని చెప్పారు.  ఇంతటి ఘనమైన అభివృద్ధికి కారణమైన సీఎం కేసీఆర్ కు రానున్న ఎన్నికల్లో మరింత అండగా నిలిచి, మంచి మెజార్టీతో గెలిపించుకోవలన్నారు.
మళ్లీ కేసీఆర్ సీఎం గా వస్తేనే తెలంగాణా మరింత అభివృద్ధి పథంలో పయనిస్తుందని అన్నారు. కేసీఆర్ అంటేనే అభివృద్ధి కి చిరునామా అన్నారు. ఉద్యమ నేతగా, సీఎం గా కేసీఆర్ తెలంగాణా పేరును ప్రపంచ పటంలో సువర్ణక్షరాలతో లిఖిoపజేశారని  అన్నారు. దేశంలోనే అభ్యుదయ రాష్ట్రంగా చేసిన దార్శనికుడు కేసీఆర్ అన్నారు.రానున్న రోజుల్లో తెలంగాణా ఆర్థిక, రాజకీయ, సామాజిక, సంక్షేమం, అభివృద్ధి,అస్తిత్వం స్థిరీకరణకు కేసీఆర్ నాయకత్వం కావాలన్నారు. ఇదంతా సవ్యంగా జరగాలంటే రానున్నకాలంలో  కేసీఆర్ సీఎం గా ఉండాలన్నారు. మరింత విశాలమైన తెలంగాణా ప్రగతి కోసం ప్రజలు తెలివితో ,ఉద్యమ స్పూర్తితో ఓట్లు వేసి, కేసీఆర్ ను సీఎం గా చేసుకోవాలన్నారు. కేసీఆర్ విజయం ఆయన కోసం కాదని, బంగారు తెలంగాణా మరింత అభివృద్ధి స్థిరీకరణ కోసమని నామ పేర్కొన్నారు. ఆ రెండు పార్టీలకు అధికార దాహం తప్పా తెలంగాణా అభివృద్ధి పై ధ్యాసే లేదని గుర్తించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.భవిష్యత్ లో  తెలంగాణా మరింత అభివృద్ధి ని ,ప్రగతిని సొంతం చేసుకోవాలంటే కేసీఆర్ చేతుల్లోనే పాలన ఉండాలని నామ
నాగేశ్వరరావు అన్నారు