వేల్పుల కుటుంబానికి అర్థిక చేయూత చేసిన దేవీ లాల్
వేల్పుల ఎర్రమ్మకు నివాళ్లు అర్పించిన వైరా నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకుడు
వేల్పుల కుటుంబానికి అర్థిక చేయూత చేసిన దేవీ లాల్
== వేల్పుల ఎర్రమ్మకు నివాళ్లు అర్పించిన వైరా నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకుడు
జూలురుపాడ్, ఏప్రిల్ 29(విజయంన్యూస్)
మండల కేంద్రానికి చెందిన తెలంగణ మలిదశ ఉద్యమ కారుడు,తెరాస పార్టీ వ్యవస్థాపక జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల నరసింహారావు నాయనమ్మ శతాధిక వృద్ధురాలు వేల్పుల ఎర్రమ్మ ఇటీవల మరణించారు.సమాచారం తెలుసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బంజారా గిరిజన నాయకుడు,వైరా నియోజక వర్గం బి ఆర్ ఎస్ పార్టీ నాయకుడు భూక్యా దేవీ లాల్ నాయక్ శని వారం వారి కుటుంబాన్ని సందర్శించారు.ఎర్రమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం వేల్పుల తో మాట్లాడుతూ వివరాలు అడిగి తెలుసుకున్నారు.100 సం.రాలు పైగా జీవించటం చాలా అరుదైన విషయమని,ఆమె పాటించిన ఆరోగ్య సూత్రాలు,జీవన విధానమే కారణమని,వ్యక్తిగత ఆరోగ్య క్రమ శిక్షణ,తన పని తానూ చేసుకుంటూ వుండడమే ఇందుకు నిదర్శనం అని అన్నారు.వ్యక్తి గతంగా తాను మీ కుటుంబానికి అందుబాటు లో వుంటానని హామీ ఇస్తూ కొంత మొత్తం ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్య క్రమంలో వేల్పుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు,
ఇది కూడా చదవండి: క్రీడాలను ప్రోత్సంహించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ: మంత్రి శ్రీనివాస్ గౌడ్