Telugu News

 రంగనాయకుల గుట్టకు పోటెత్తిన భక్తులు .

కరిగిరి శ్రీలక్ష్మీ రంగనాథ స్వామి వారి దేవస్థానము లో వైకుంఠ  ఉత్తరద్వార దర్శనము

0

 రంగనాయకుల గుట్టకు పోటెత్తిన భక్తులు .

== కరిగిరి శ్రీలక్ష్మీ రంగనాథ స్వామి వారి దేవస్థానము లో వైకుంఠ  ఉత్తరద్వార దర్శనము

(ఖమ్మం-విజయంన్యూస్):

నగరంలో సోమవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా మూడవ పట్టణం 34వ డివిజన్ రంగనాయకుల గుట్ట కరిగిరి శ్రీలక్ష్మీ రంగనాథ స్వామి వారి దేవస్థానము లో వైకుంఠ ద్వారము ఉత్తరద్వార దర్శనము అత్యంత వైభవంగా కన్నులపండువగా జరిగినది. ముందుగా శ్రీ రంగనాథ స్వామి వారికి ప్రత్యేక అభిషేకం గోదా అమ్మ వారి పల్లకి సేవ జరిగినది. ఆలయ అర్చకులు  వికాస తరంగిణి భక్త బృందం వైకుంఠ గద్యం అనుసంధానం చేస్తుండగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం వైభవంగా జరిగినది.

ఇది కూడా చదవండి: భద్రాచలంలో వైభోపేతంగా తెప్పోత్సవం

తెల్లవారుజాము నుండి భక్తులు అత్యధిక సంఖ్యలలో పాల్గొన్నారు . స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాద్ స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులయ్యారు . ద్వార పూజ ను శ్రీ రంగనాధ భక్తమండలి చైర్మన్ జూలకంటి సతీష్ కుమార్ దంపతులు చేశారు . ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు బూరుగడ్డ కందాళై శ్రీధర చార్యులు , అనువంశిక అర్చకులు , బూరుగడ్డ కందాళై వెంకటకృష్ణమా చార్యులు , ఆచార్య సందీప్ 34వ డివిజన్ కార్పోరేటర్ రుద్రగాని శ్రీదేవి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు