Telugu News

భక్తుల కొంగుబంగారం మినీ మేడారం.

== గిరిజన ఆరాధ్య దైవం కోసం భక్తజనం.

0

భక్తుల కొంగుబంగారం మినీ మేడారం.

 గిరిజన ఆరాధ్య దైవం కోసం భక్తజనం.

 జాతర కోసం ముమ్మర ఏర్పాట్లు.

సింగరేణి అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి.

 ముమ్మరంగా సాగుతున్న పనులు.

 ఏర్పాట్లపై అధికారుల ప్రత్యేక దృష్టి.

(మణుగూరు విజయం న్యూస్)..

గిరిజన ఆరాధ్య దైవంగా భాసిల్లుతు భక్తుల కొంగు బంగారమై మణుగూరు మండలంలోని తో గూడెం గ్రామంలో కొలువైన సమ్మక్క సారక్క అమ్మవార్ల దేవస్థానం మినీ మేడారం లో జాతర కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈనెల 16,17,18 తేదీలలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా బుధవారం సమ్మక్క గురువారం సారలమ్మ శుక్రవారం పగిడిద్దరాజు లు గద్దెలపై కొలువుతీరనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా లోని తెలంగాణ కుంభమేళా గా పేరు పొందిన సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల జాతర తరువాత అంతే అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న మణుగూరు మండలం లోని గ్రామంలో పేరుపొందిన సమ్మక్క సారక్క దేవాలయం లో జాతర పౌర్ణమి నుండి మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనుంది.

also read :-తెలంగాణ భారతదేశంలో లేదా ? : నామా నాగేశ్వరరావు

జాతర ఏర్పాట్ల కోసం తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖతో పాటు సింగరేణి యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించి జాతర ఏర్పాట్ల కోసం పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెలను ఆధునీకరించి గద్దెల చుట్టూ నూతనంగా రైలింగ్ ను ఏర్పాటు చేశారు. భక్తులకు త్రాగునీరు మరుగుదొడ్లు ఏర్పాటు కోసం సింగరేణి యాజమాన్యం ప్రత్యేక నిధులు కేటాయించి అధికారుల పర్యవేక్షణలో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తుల తలనీలాలు, టెంకాయల టెండర్లతో పాటు జాతరలో దుకాణాలు ఏర్పాటు కోసం అధికారులు టెండర్లు పిలిచారు. మరోవైపు గిరిజన సాంప్రదాయ పద్ధతిలో జరగనున్న జాతర కోసం సర్పంచ్ బొగ్గం రజిత పర్యవేక్షణలో ఏర్పాట్ల కోసం పంచాయతీ సిబ్బంది పనులను కొనసాగిస్తున్నారు.

also read :-కూసుమంచిలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్దం..

జాతర కోసం ప్రత్యేకమైన వరంగల్ జిల్లాతో పాటు చర్ల దుమ్ముగూడెం ప్రాంతాలనుండి గిరిజన పూజారులు దేవర బాలలు రానున్నారు. మణుగూరు ఏటూరునాగారం ప్రధాన రహదారిపై కొలువైన సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు భారీగా భక్తులు రానున్నారు. మేడారం కు వెళ్లే ప్రతి భక్తులు తొలుత మినీ మేడారంలోని దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించి వెళ్ళడం ఆనవాయితీగా వస్తుంది. దీనితో రోజురోజుకు దేవస్థానం ఆదాయం పెరుగుతుంది. మినీ మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రెవెన్యూ పోలీస్ ఫారెస్ట్ అధికారుల పర్యవేక్షణ లో జాతర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

బొగ్గం రజిత తోగ్గుడెం సర్పంచ్…
గిరిజనుల ఆరాధ్యదైవం సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్ల కోసం ముమ్మరంగా పనులు సాగుతున్నట్లు సర్పంచ్ బొగ్గం రజిత విజయం న్యూస్ కు తెలిపారు. భక్తులు పూర్తి నిబంధనలను పాటించి అధికారులకు సహకరించి భక్తులు జాతర కు హాజరు కావాలని ఆమె కోరారు.