Telugu News

ఘనంగా బుద్ధ వనములో2566 వ బుద్ధ జయంతి వేడుకలు

శ్యామ్ , నాగార్జునసాగర్ ప్రతినిధి -విజయం న్యూస్

0

ఘనంగా బుద్ధ వనములో2566 వ బుద్ధ జయంతి వేడుకలు

(శ్యామ్ , నాగార్జునసాగర్ ప్రతినిధి -విజయం న్యూస్)

నాగార్జునసాగర్ లో తెలంగాణ టూరిజం అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధ వనములో సోమవారం నాడు గౌతమబుద్ధుని 2566 వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బౌద్ధ గురువులు బౌద్ధ భిక్షువులతో బౌద్ధ సంప్రదాయబద్ధంగా వాయిద్యాలు చేసుకుంటూ బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో బుద్ధ చరిత వనంలోని బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించి బుద్ధ వందనాలు చేశారు. అనంతరం మహా స్తూపం అంతర్భాగంలోని సమావేశ మందిరంలో మైసూర్ నుండి వచ్చినటువంటి బౌద్ధ భిక్షువుల చే, మహాబోధి సొసైటీ ఆనంద బుద్ధ విహార బౌద్ధ భిక్షువుల చే చాoటింగ్ ( ప్రార్థనలు) నిర్వహించారు.

also read :-ఎండ తీవ్రత తో వడ దెబ్బకు గురైన

ఈ సందర్భంగా సంఘ పాల బంతే మాట్లాడుతూ బుద్ధుడు పుట్టినటువంటి నేపాల్లోని లుంబిని, బుద్ధునికి జ్ఞానోదయం అయిన బీహార్ రాష్ట్రంలోని బుద్ధ గయ , బుద్ధుని ధర్మ చక్ర పరివర్తన మొదటి ఉపన్యాసం ఇచ్చిన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సారనాథ్ ,బుద్ధుడు నిర్యాణం పొందిన కృషి నగర్ లాగా బుద్ధవనం ప్రాజెక్టు ఈ నాలుగింటిని సమ్మేళనం చేస్తూ భవిష్యత్తులో ప్రఖ్యాతి పొందుతుందని అన్నారు. మైసూరుకు చెందిన బౌద్ధ గురువు గేసే నగ్గ్ వాంగ్ మాట్లాడుతూ అంతర్జాతీయంగా బుద్ధవనం ప్రాజెక్టు ఎంతో ప్రత్యేకంగా రూపుదిద్దుకుందని బౌద్ధ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుందని అన్నారు .ఈ కార్యక్రమంలో హర్యానా అడిషనల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్, ప్రముఖ ఎడిటర్ రామ చంద్రమూర్తి, బుద్ధవనం ఓ ఎస్ డి సుధన్ రెడ్డి, ఎస్సీ క్రాంతి బాబు, బౌద్ధ నిపుణుడు ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ ఈమని శివనాగిరెడ్డి ,బుద్ధవనం డిజైన్ ఇన్చార్జ్ శ్యామ్సుందర్ తదితరులు పాల్గొన్నారు.