Telugu News

ఈనెల 27 న మేడారం లో ఆదివాసి మహిళ సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నికను విజయ వంతం చేయాలి

తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి.అరుణ్ కుమార్

0

ఈనెల 27 న మేడారం లో ఆదివాసి మహిళ సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నికను విజయ వంతం చేయాలి

తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి.అరుణ్ కుమార్

(గజ్జెల.రాజశేఖర్ తాడ్వాయి విజయం న్యూస్):-

ములుగు జిల్లా, తాడ్వాయి మండల కేంద్రం లో తుడుందెబ్బ ముఖ్య కార్య కర్తల అత్యవసర సమావేశం ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు దబ్బ గట్ల ,శ్రీకాంత్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం కి ముఖ్య అధిదిగా హాజరైన ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపథి.అరుణ్ కుమార్ మాట్లాడుతూ మే 13,14,15 తేదీలలో మణుగూరు లో జరిగిన రాష్ట్ర స్థాయి ప్లీనరీలో తీర్మానం చేసిన విధంగా ఈనెల శ్రీ సమ్మక సారలమ్మ పోరు గడ్డ మేడారం లో ఆదివాసి మహిళ సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నిక కార్యక్రమం నిర్వహణ చేస్తున్నట్లు తెలిపారు.

also read :-రేపు తెరాస నియోజకవర్గ కార్యకర్తల సమావేశం

శ్రీ సమ్మక సారలమ్మ మేడారం అంటే చరిత్ర లో గొప్ప పోరాటానికి ఒక నిదర్శనం, ఆ పేరు వింటేనే మాతృస్వామిక సమాజానికి ఆదివాసి సమాజం ఎటువంటి విలువనిస్తుంది అనేది తెలిపే క్రమం లో నేడు తుడుందెబ్బ ఉద్యమానికి మహిళ శక్తి అవసరం అని, స్త్రీ లేని సమాజ నిర్మాణం సాధ్యం కాదు అనేది ఎంత నిజమో, మహిళ లేని ఉద్యమాలు కూడా విజయం సాధించ లేవు అనేది అంతే నిజం అనేది పూర్తి స్థాయిలో గుర్తించి, మహిళ ఉద్యమ బలోపేతానికి మేడారం కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచం లో మహిళ లు పూర్తి స్థాయిలో నిలిచిన ఉద్యమాలే గెలిచయని అన్నారు. జార్ఖండ్ రాష్ట్రం అస్సాం రాష్ట్రం ల లో ఆదివాసి మహిళ ల పాత్ర సంస్కృతి పునర్నిర్మాణం పాత్ర గొప్పదని ఆ తరహాలో మహిళ ఉద్యమం నీ తయారు చేయనున్నట్లు తెలిపారు.

also read :-అభివృద్ధి తెలంగాణ రోల్ మోడల్….

సమ్మక సారలమ్మ మొదలు రాని దుర్గవతి, లాంటి ఆదివాసి మహిళలు అనేక పోరాటాలు చేశారని, గోండు రాజ్యాలను నడిపిన వారిలో అధిక శాతం ఆదివాసీ మహిళలు ఉన్నారని అన్నారు ఆ వారసత్వం రావాలని తెలియ చేసారు, ఆదివాసి సమాజం కాపాడ బడాలి అంటే మహిళ నాయక్త్వం రావాల్సిన అవసరం ఉంది అన్నారు.

also read :-జిల్లాలో పొంగులేటి విస్తృత పర్యటన

ఆదివాసి మహిళ లలపై అత్యాచారాలు అధికం అవుతున్నాయని, విద్య కూడా అందక ఆదివాసి మహిళలు వెనుక బడి పోతున్నారని అన్నారు, ఆదివాసి సమాజం లో వరకట్నం లేదు కానీ నేడు బయటి సమాజం పోకడలతో వరకట్నం అనేది ఆదిమ సమాజం నీ పట్టి పీడిస్తుంది అని అన్నారు వరకట్న నిషేదం వైపు ఆలోచన చేయాలని అన్నారు, మనవణ్ణి రెక్కాడితే డొక్కా ఆడని సమాజాలు అని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అన్నారు.

ఈ సమావేశం కి రాష్ట్ర కమిటీ ఎన్నిక కార్యక్రమం నీ అన్ని జిల్లా ల మహిళ కమిటీ లు హాజరయ్యి విజయ వంతం చేయాలి అని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపుని స్తుంది అని తెలియ చేశారు. ఈ కార్యక్రమం లో ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోర్ని బెల్లీ.గణేష్, రేగ, కిరణ్ కుమార్ తడి తరులు పాల్గొన్నారు